ఎట్టకేలకు 'ఎల్లమ్మ' కు ముహూర్తం!
వివిధ షోల్లో ఇచ్చిన స్టేజ్ ప్రెజెన్స్ , ఎనర్జీ ఆయనను ఒక మంచి నటుడిగా నిలబెడతాయని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.;
సంగీత దర్శకులు నటులుగా మారడం కొత్తేం కాదు. ఈ నేపథ్యంలో రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఎప్పుడు వెండితెరపై కనిపిస్తారా? అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. తాజాగా `బలగం` సినిమాతో నటుడిగా ఎంట్రీ ఇస్తోన్న సంగతి తెలిసిందే. `బలగం` ఫేం వేణు ఎల్లండి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. వాస్తవానికి ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్ ప్రారంభం కావాలి. అనివార్య కారణాలతో వాయిదా పడింది. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు `ఎల్లమ్మ` ఈ నెల మూడో వారం నుంచి షూటింగ్ ప్రారంభించేందుకు ముహూర్తం ఖరారైంది. ఈ వార్తతో డీఎస్‌పీ అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది.
ఈ సినిమాతో దేవి శ్రీ ప్రసాద్ తొలిసారి పూర్తి స్థాయిలో మేకప్ వేసుకోబోతున్నారు. గతంలో కొన్ని సినిమాల్లో స్పెషల్ సాంగ్స్‌లో మెరిసినా? ఒక కథానాయకుడిగా ఆయన కెరీర్‌కు ఇది అత్యంత కీలకమైన మలుపు. వేణు యెల్దండి తన మార్కు ఎమోషన్స్ , సహజత్వంతో కూడిన కథను సిద్ధం చేసాడు. `ఎల్లమ్మ` అనే టైటిల్ వినడానికి రొటీన్ గా అనిపించినా? ఇదో పవర్‌ఫుల్ కంటెంట్ ఉన్న చిత్ర. గ్రామీణ నేపథ్యాన్ని ప్రతిబింబించేలా ఉండటం సినిమాపై అంచనాలను పెంచుతోంది. సంగీతం- నటన అనేవి రెండు భిన్నమైన ప్రక్రియలు. అయినా డీఎస్‌పీ ఈ చిత్రానికి రెండు రకాలుగానూ బాద్యత లు తీసుకోవడం విశేషం. కెమెరాను ఫేస్ చేయడం దేవి శ్రీకి కొత్తేం కాదు.
వివిధ షోల్లో ఇచ్చిన స్టేజ్ ప్రెజెన్స్ , ఎనర్జీ ఆయనను ఒక మంచి నటుడిగా నిలబెడతాయని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. వేణు యెల్దండి స్క్రిప్ట్ వర్క్ విషయంలో చాలా కాలం పాటు శ్రమించి దేవి శ్రీ ప్రసాద్ బాడీ లాంగ్వేజ్‌కు సరిపోయేలా పాత్రను తీర్చిదిద్దారు. ఈ నెల మూడో వారం నుంచి ప్రారంభమయ్యే తొలి షెడ్యూల్‌లో కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించేందుకు ప్లాన్ చేస్తున్నారు. వేణు యెల్దండి `బలగం` చిత్రంతో మట్టి వాసన కలిగిన కథలకు బాక్సాఫీస్ వద్ద ఎంతటి ఆదరణ ఉంటుందో నిరూపించారు.
ఈ నేపథ్యంలో `ఎల్లమ్మ` కూడా అదే తరహాలో గుండెకు హత్తుకునేలా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ సినిమాతో మరో క్లాసిక్ హిట్ ఇస్తాడని ప్రేక్షకులు సహా నిర్మాత దిల్ రాజు అంతే విశ్వశిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ హీరోగా మారడం అనేది టాలీవుడ్‌లో ఒక పెద్ద సాహసంగానే చెప్పాలి. సంగీత ప్రపంచంలో రారాజుగా వెలుగొం దుతున్న ఆయన నటుడిగా ప్రేక్షకుల హృదయాలను ఎలా గెలుచుకుంటారో చూడాలి. ఈ నెల మూడో వారం నుంచి ప్రారంభం కానున్న ఈ ప్రయాణం డీఎస్‌పీ కెరీర్‌లో ఒక కొత్త అధ్యాయానికి నాంది కానుంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు బయటకు రానున్నాయి.