ఇరవై ఏళ్లకే ఇద్దర్ని దత్తత తీసుకున్న హీరోయిన్.. పెళ్లి కూడా కాదన్నారట..!

Update: 2021-01-05 08:42 GMT
అవకాశాలను అందిపుచ్చుకునేందుకు అందరూ ఎగబడతారు.. కానీ.. అభాగ్యులను ఆదుకునేందుకు మాత్రం కొందరే చేయి చాచుతారు! అలాంటి వారిలో ఒకరు రవీనాటాండన్. వెండి తెరపై ఓ వెలుగు వెలిగిన రవీనా.. తన హృదయం కూడా అంతే ప్రకాశవంతమైందని చాటుకుంది. తన చిన్న వయసులోనే ఇద్దరు అమ్మాయిలను దత్తత తీసుకొని గొప్ప మనసు చాటుకుంది ఈ బాలీవుడ్ బ్యూటీ.

వాస్తవానికి సినీ ఇండస్ట్రీ, హీరోయిన్లు అంటేర జనాల్లో ఒకరకమైన భావం ఉన్నప్పటికీ.. మనసున్న నటీమణులు చాలామందే ఉన్నారు.  సుస్మితా సేన్, రవీనా, స‌న్నీలియోన్, హ‌న్సిక‌.. వీళ్లంతా అనాథ‌ల‌ను ద‌త్త‌త తీసుకొని, అక్కున చేర్చుకున్న దయామయులే. దిక్కూమొక్కు లేని పిల్ల‌లకు అన్నీ తామై.. సకల వ‌స‌తులూ క‌ల్పిస్తున్నవారే.

నిజానికి హీరోయిన్ల కెరీర్ గాలిలో దీపం లాంటిదే. ఓవర్ నైట్లో ఎవరెస్టు స్థాయికి చేరగలరు.. ఒకే సినిమాతో అథ:పాతాళానికి పడిపోగలరు. ఎప్పుడు అవ‌కాశాలు వ‌స్తాయో, ఎప్పుడు ఆదరణ కోల్పోతారో చెప్పలేం. అందుకే.. దీపం ఉండ‌గానే ఇల్లు చ‌క్క‌బెట్టుకోవాల్సిన స్థితిలోనే ఉంటారు చాలా మంది హీరోయిన్లు. అయితే.. చిన్న వ‌య‌సులోనే పెద్ద బాధ్య‌త‌లు తీసుకొని, తమ విశాల మనసును చాటుకుంటారు పలువురు. వారిలో ముందు వరసలో నిలుస్తుంది రవీనా టాండన్.

ప్ర‌స్తుతం ర‌వీనా వ‌య‌సు 46 సంవత్సరాలు. కానీ.. ఈమె త‌న 21వ యేటనే ఇద్ద‌ర‌మ్మాయిల‌ను ద‌త్త‌త తీసుకోవడం గమనార్హం. అప్పటి నుంచే వారి బాధ్య‌త‌లు తీసుకొని, ఆలనాపాలనా చూడడం మొదలు పెట్టింది. బాలీవుడ్ లో స్టార్ గా ఎదిగి, ఇప్ప‌టికీ గొప్ప ఫ్యాన్ ఫాలోయింగ్ ను క‌లిగి ఉన్న ర‌వీనా.. అలా చిన్న వ‌య‌సులోనే ఇద్ద‌రు పిల్ల‌లను అడాప్ట్ చేసుకోవడం విశేషం. అయితే.. ఇద్ద‌రు ఆడ‌పిల్ల‌ల‌ను ద‌త్తత తీసుకున్న‌ప్పుడు చాలా మంది ఆమెను భ‌య‌పెట్టార‌ట‌. ‘ఇలా పిల్ల‌ల‌ను క‌లిగి ఉంటే.. నీకు పెళ్లి కూడా కాద’న్నారట కొంత‌మంది‌. అయినప్పటికీ.. అవేమీ పట్టించుకోకుండా వారిని తనే పెంచింది.

ఆ తర్వాత.. వారెవరో భయటపెట్టినట్టు తన జీవితంలో ఏమీ జరగలేదు. రవీనాను పెళ్లి చేసుకోవ‌డానికి మ‌హామ‌హులే పోటీ ప‌డ్డారు. చివరకు ఫిల్మ్ డిస్ట్రిబ్యూట‌ర్ అనిల్ త‌డానీని ఈమె పెళ్లి చేసుకున్నారు. ఆ త‌ర్వాత వీరికి ఇద్ద‌రు పిల్ల‌లు కూడా క‌లిగారు. కాగా.. ర‌వీనా ద‌త్తత తీసుకున్న పిల్ల‌ల్లో అమ్మాయి పెళ్లి ఇటీవల జ‌రిగిన‌ట్టు సమాచారం. ఇదంతా చూస్తుంటే.. రవీనా బాహ్య సౌందర్యమే కాదు.. అంత:సౌందర్యం కూడా అమోఘం అనిపిస్తోంది కదూ!
Tags:    

Similar News