క‌ర‌ణ్ జోహార్ ని లెక్క‌ చేయ‌ని హీరోలు హీరోయిన్లు వీళ్లే!

Update: 2021-05-24 06:30 GMT
బాలీవుడ్ లో ద‌శాబ్ధాల పాటు నెప్టోయిజమ్ ని ఎంక‌రేజ్ చేస్తూ .. న‌ట‌వార‌సుల్ని ప‌రిచ‌యం చేస్తూ.. వారి కెరీర్ ని తీర్చిదిద్దుతున్న ప్ర‌ముఖ ద‌ర్శ‌క‌నిర్మాత‌ క‌ర‌ణ్ జోహార్ ఔట్ సైడ‌ర్స్ కి అస్స‌లు అవ‌కాశాలివ్వ‌ర‌ని చెబుతుంటారు. క‌నీసం ఆడిష‌న్స్ కి పిలిచేందుకైనా ఆయ‌న ఇష్ట‌ప‌డ‌ర‌నే ఆరోప‌ణ‌లున్నాయి. అస‌లు క‌ర‌ణ్ జోహార్ తో క్రియేటివ్ డిఫ‌రెన్సెస్ ఉన్న ఔట్ సైడ‌ర్లు  ఎంద‌రు ఉన్నారు? అన్న‌ది ఆరా తీస్తే చాలా ఆస‌క్తిక‌ర విష‌యాలే తెలిసాయి.

కార్తీక్ ఆర్య‌న్-ఇషాన్ ఖ‌త్త‌ర్- కంగ‌న ర‌నౌత్- ఆయుష్మాన్ ఖురానా-ప్రియాంక చోప్రా- అనుష్క శ‌ర్మ‌- ప్ర‌భాస్.. వీళ్లెవ‌రూ క‌ర‌ణ్ జోహార్ తో సినిమాలు చేయ‌రు?!

బాహుబ‌లి త‌ర్వాత ప్ర‌భాస్ కి క‌ర‌ణ్ జోహార్ ఆఫ‌ర్ ఇస్తే ఎందుక‌నో వ‌దులుకున్నారు. క్రియేటివ్ డిఫ‌రెన్సెస్ వ‌చ్చాయ‌ని టాలీవుడ్ లో ప్ర‌చార‌మైంది. ఆ త‌ర్వాత కాఫీ విత్ క‌ర‌ణ్ షోలో క‌ర‌ణ్ జోహార్ తో ప్ర‌భాస్ చాలా స‌ర‌దాగా క‌లివిడిగా క‌నిపించ‌డంతో ఇరువురి న‌డుమా వివాదం స‌మ‌సిపోయింద‌ని భావించారు. కానీ ఆ ఇద్ద‌రూ కలిసి ప‌ని చేస్తారా లేదా? అన్న‌ది ఇంకా చెప్ప‌లేని ప‌రిస్థితి. క‌లిసి ప‌ని చేయ‌క‌పోవ‌డానికి ఎవ‌రి కార‌ణాలు వారికి ఉన్నాయి.

వరుస విజ‌యాల‌తో స్టార్ డ‌మ్ అందుకున్న న‌వ‌త‌రం హీరో కార్తీక్ ఆర్య‌న్ తో ఇటీవ‌ల క‌ర‌ణ్‌ వివాదం తెలిసిందే. దోస్తానా సీక్వెల్ నుంచి అత‌డిని తొల‌గిస్తున్నామ‌ని ఇక ఎప్ప‌టికీ కార్తీక్ ఆర్య‌న్ తో ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్ ప‌ని చేయద‌ని ఆ సంస్థ ప్ర‌తినిధులు ప్ర‌క‌టించారు. కార్తీక్ ఆర్య‌న్ కి వృత్తిగ‌త నిబ‌ద్ధ‌త లేద‌ని నింద‌లు వేశారు.

ఇటీవ‌లి కాలంలో ఇషాన్ ఖ‌త్త‌ర్ ని త‌గ్గిస్తున్న క‌ర‌ణ్ వైఖ‌రి బ‌య‌ట‌ప‌డింది. ఇద్ద‌రి మ‌ధ్యా కొంత‌కాలంగా మాట‌ల్లేవ్.. కానీ ఒక సినిమా కోసం ప‌ని చేస్తున్నారు. ప్ర‌స్తుతానికి షాహిద్ క‌పూర్ సోద‌రుడు ఇషాన్ తో క‌ర‌ణ్ విభేధాలు కొన‌సాగుతున్నాయని బాలీవుడ్ మీడియా క‌థ‌నాలు వెల్ల‌డిస్తున్నాయి.

ప‌రిశ్ర‌మ‌లో వైవిధ్య‌మైన చిత్రాల్లో న‌టించి బ్లాక్ బ‌స్ట‌ర్లు అందుకుంటూ త‌న‌కంటూ ఒక ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్న యువ‌హీరోగా ఆయుష్మాన్ ఖురానా గురించి ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. అత‌డు ఆర్జేగా ప‌ని చేసేప్పుడు క‌ర‌ణ్ జోహార్ కంపెనీలో ఆడిష‌న్ కోసం ప్ర‌య‌త్నిస్తే.. ఔట్ సైడర్స్ కి అవ‌కాశం లేదంటూ ఫోన్ పెట్టేశార‌ట‌. పైగా అత‌డికి ల్యాండ్ లైన్ నంబ‌ర్ మాత్ర‌మే ఇచ్చారు. ఈ విష‌యాన్ని ఆయుష్మాన్ ప‌బ్లిగ్గానే చెప్పి విమ‌ర్శించారు.

పార్టీల‌కు కొంద‌రిని పిలిచినా కానీ వారితో క‌ర‌ణ్ ఎప్ప‌టికీ ప‌ని చేయ‌రు. ఇంత‌కుముందు ప‌లు చిత్రాల‌ ఎంపిక‌లు స‌హా ర‌క‌ర‌కాల విష‌యాల్లో ప్రియాంక చోప్రా.. అనుష్క శ‌ర్మ వంటి టాప్ హీరోయిన్స్ తో క‌ర‌ణ్ ఘ‌ర్ష‌ణ ప‌డ్డార‌ని క‌థ‌నాలొచ్చాయి. ఆ ఇద్ద‌రూ ఇప్పుడు ఇండివిడ్యువ‌ల్ గా నిర్మాత‌లు. ఇక వారికి క‌ర‌ణ్ తో ప‌ని చేయాల్సిన అవ‌స‌రం లేదు. పీసీ ఏకంగా గ్లోబ‌ల్ స్టార్ కాగా.. అనుష్క శ‌ర్మ ది గ్రేట్ విరాట్ కోహ్లీ భార్యామ‌ణిగా త‌న ప్రొడ‌క్ష‌న్ విలువ‌ను ప‌దింత‌లు పెంచేందుకు ప్ర‌ణాళిక‌ల్లో ఉన్నార‌ట‌. క‌ర‌ణ్ బ్యాన‌ర్ లో అనుష్క శ‌ర్మ న‌టించ‌రు.

మ‌రోవైపు ధ‌ర్మాధినేత క‌ర‌ణ్ జోహార్ అంటే అంతెత్తున లేచి ప‌డే కంగ‌న ర‌నౌత్ గురించి చెప్పాల్సిన ప‌నే లేదు. న‌ట‌వార‌సుల్ని ఎంక‌రేజ్ చేసే క‌ర‌ణ్ జోహార్ ఒక మాఫియా పెద్ద మ‌నిషి అని డైరెక్ట్ గానే విమ‌ర్శిస్తారు కంగ‌న‌. ఈ స్టార్ హీరోయిన్ ప్ర‌స్తుతం ఉత్త‌రాది- ద‌క్షిణాది అనే తేడా లేకుండా ఏల్తోంది. నిర్మాత‌గా ద‌ర్శ‌కురాలిగానూ రాణిస్తున్నారు. అందువ‌ల్ల క‌రణ్ జోహార్ తో అంట‌కాగాల్సిన అవ‌స‌రం అస‌లే లేదు.
Tags:    

Similar News