సైలెంట్ కిల్లర్ లా దూసుకొస్తున్న సీనియర్ నాయిక కూతురు!
బాలీవుడ్ లో నటవారసుల వెల్లువ గురించి చెప్పాల్సిన పనే లేదు. ఇటీవలే పాపులర్ కథానాయిక పూజా భేడీ వారసురాలు ఆలయ ఫర్నిచర్ వాలా బాలీవుడ్ కి పరిచయమైంది. ఈ భామ సైలెంట్ గా కెరీర్ పరంగా స్పీడ్ పెంచే పనిలో ఉందిట. జవానీ జానెమాన్ చిత్రంతో అరంగేట్రం చేసిన ఆలయ తొలి ప్రయత్నమే ఎఫ్ విమర్శకుల ప్రశంసలను పొందమేగాక ప్రేక్షకాభిమానుల మనుసుల్ని గెలుచుకుంది.
కొంత గ్యాప్ తర్వాత ఆలయ తన మొట్టమొదటి మ్యూజిక్ వీడియోతో అభిమానుల ముందుకు వస్తోంది. కొత్త పాట ఆజ్ సజేయలో కనిపిస్తుంది. మ్యూజిక్ వీడియో లో ప్రతి ఫ్రేమ్ లో ఎంపిక చేసిన దుస్తుల్లో ఎంతో ఆకర్షణీయంగా స్టైలిష్ గా కనిపించనుందని సమాచారం. మ్యూజిక్ వీడియోకి పునిత్ మల్హోత్రా దర్శకత్వం వహించారు.
ఆలయా ఎఫ్ తన కెరీర్ ప్రారంభంలోనే పెద్ద దర్శకుడితో కలిసి పనిచేయడం చాలా పెద్ద ఫీట్. చాలా చిన్న వయస్సులోనే ఉత్తమ తొలి చిత్ర కథానాయికగా ఫిలింఫేర్ అవార్డును అందుకుంది. తొలి చిత్రంలోనే ఈ కుర్రబ్యూటీ ఎంతో పరిణతితో నటించి ఆకట్టుకుంది. చాలా తక్కువ వ్యవధిలో తన నటనతో ప్రేక్షకులను ఆకర్షించింది. ప్రముఖ వినోద పోర్టల్ ద్వారా ఆమె ఇటీవల అత్యంత శక్తివంతమైన ఉత్తమ ప్రదర్శన అవార్డును కూడా గెలుచుకుంది.
అలయ ఎఫ్ తహా షా బదుషా నటించిన ఆజ్ సజేయ రిలీజ్ కి రెడీ అవుతోంది. గోల్డీ సోహెల్ ఈ పాటను పాడారు. ధర్మ 2.0 నిర్మించిన ఈ పాటను స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 డైరెక్టర్ పునిత్ మల్హోత్రా నిర్ధేశనంలో తెరకెక్కించారు. ఈ సాంగ్ ప్రమోషన్స్ లో భాగంగా ఆలయా మీడియా ముందు హొయలు పోయిన తీరు ప్రముఖంగా చర్చకు వచ్చింది. ఇక ఈ పాటలో వధువు గెటప్ లోనూ ఆలయ దర్శనమివ్వనుంది. తాజాగా ఆలయ షేర్ చేసిన ఫోటో వైరల్ గా మారుతోంది.