జాన్వీ కపూర్ ను బాధపెట్టిన కామెంట్

Update: 2022-07-21 03:30 GMT
వారసత్వం నుంచి వచ్చిన సినీ తారలు సక్సెస్ అవ్వాలంటే అదృష్టంతో పాటు కష్టపడే గుణం కూడా ఉండాలి. బ్యాగ్రౌండ్ ఉన్నంత మాత్రాన సినిమా పరిశ్రమలో సక్సెస్ అవ్వలేరు అని చాలా మంది సినీ సెలబ్రిటీలు ఉదాహరణగా నిలిచారు.

ఇక హీరోయిన్స్ గా బ్యాగ్రౌండ్ తో వచ్చిన వాళ్ళు కూడా ఎంతో ఆకట్టుకుంటే గాని సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకోలేరు. ఇక అలాంటి వారి కి ఒక్క సినిమా ఫ్లాప్ అయినా కూడా నెగిటివ్ కామెంట్స్ ఒక రేంజ్ లో వస్తూ ఉంటాయి.

స్టార్స్ పిల్లలకు వాటన్నిటికీ తట్టుకుని ఉండాలి అంటే కూడా కాస్త కష్టంగానే ఉంటుంది. ఇక కెరీర్ మొదటి నుంచి కూడా వరుస అపజయాలతో పాటు మధ్యలో కొన్ని విమర్శలు కూడా ఎదుర్కొంటున్న బ్యూటిఫుల్ హీరోయిన్ జాన్వీ కపూర్ ఎప్పుడు కూడా ఎవరు ఏమన్నా కూడా పెద్దగా పట్టించుకోలేదట. అయితే ఒక సమయంలో మాత్రం ఒక పదానికి చాలా బాధ పడినట్లు ఈ బ్యూటీ ఒక ఇంటర్వ్యూలో తెలియజేసింది.

శ్రీదేవి పెద్ద కూతురు గా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన జాన్వికపూర్ చాలా తొందరగానే అవకాశాలను అందుకుంది. ఆమె తండ్రి నిర్మాత బోనీకపూర్ అలాగే ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ ద్వారా చాలా అవకాశాలు వస్తున్నాయి. అయితే ఈ తరుణంలో జాన్వీ కపూర్ కొన్నిసార్లు సోషల్ మీడియాలో నెపోటీజమ్ కామెంట్స్ కూడా ఎదుర్కొంది. అంతేకాకుండా ఆమె గ్లామర్ ఫోటోలు పోస్ట్ చేసినప్పుడు వల్గర్ గా ఉన్నాయి అని కూడా చాలామంది అన్నారట.
Read more!

అయితే వల్గర్ అనే పదానికి మాత్రం జాన్వికపూర్ చాలా బాధ పడినట్లుగా తెలియజేసింది. నా చిన్నతనం నుంచే చిత్ర పరిశ్రమకు చాలా దగ్గరగా ఉన్నాను. కానీ ఇన్నేళ్ల కాలంలో ఆ ఒకే ఒక్క పదం తనును చాలా బాధకు గురి చేసింది అని తెలియజేసింది.

అయితే వీలైనంత వరకు  సొంతంగా అవకశాలు అందుకుంటూ నటనతో ఎక్కువ ఆకట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను అని భవిష్యత్తులో డి గ్లామరస్ పాత్రల్లో కూడా నటించడానికి తనకు ఎలాంటి ఇబ్బంది లేదని ఈ బ్యూటీ తెలియజేసింది.
Tags:    

Similar News