షూటింగ్​లో ఉన్న నటికి దయ్యం పట్టింది.. సినిమా యూనిట్​ పరుగులు

Update: 2020-10-07 08:10 GMT
ఈ మధ్య దయ్యాల సినిమాలకు మంచి గిరాకీ ఉంది. దీంతో ప్రతి నిర్మాత, దర్శకుడు ఇటువంటి కథలపైనే ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే ఇటీవల ముంబైలోని ఓ పాడుబడ్డ భవంతిలో ఓ థ్రిల్లర్​ సినిమాను తెరకెక్కిస్తుండగా..  ఉన్నట్టుండి హీరోయిన్​ వింతగా ప్రవర్తించింది. మగ గొంతుతో మాట్లాడుతూ రెచ్చిపోయింది. దీంతో ఈ సినిమా యూనిట్​కు భయం పట్టుకుంది. వెంటనే అక్కడి నుంచి పరుగులు తీశారు. ఆ నటికి నిజంగానే దయ్యం పట్టిందని భావించి వారంతా హడలెత్తి పోయారు.  ఇక అప్పటి నుంచి ఆ ప్రదేశం లో షూటింగ్​ అంటేనే సినీ నిర్మాతలు భయపడుతున్నారు. ఇంతకు ఆ ప్లేస్​ ఏదంటే ముంబై శివారు లో ఉన్న ‘ముఖేశ్​ మిల్స్​’ ఆ పేరు చెబితేనే ముంబై లోని సినిమా వాళ్లంతా వణికి చస్తారు. అయితే ఈ ప్లేస్​ చాలా భయానకంగా ఉండటంతో ఇప్పటికే అక్కడ చాలా సినిమాలను చిత్రీకరించారు. దీంతో అక్కడ తరుచూ షూటింగ్స్​ జరుగుతూ ఉండేవి.

కానీ ఇటీవల వెళ్లిన ఓ చిత్ర యూనిట్​కు మాత్రం చుక్కలు కనిపించాయి. ఆ సినిమాలో నటిస్తున్న ఓ నటి.. ఒక్కసారిగా తన స్వరం మగాడిగా మార్చింది. కళ్లు పెద్దవి చేస్తూ సినిమా టీమ్‌కు హెచ్చరికలు చేసింది. వెంటనే ఈ ప్రాంతాన్ని వదిలి వెళ్లిపోవాలని, లేకపోతే.. ముప్పు తప్పదని చెప్పింది. ఆ తర్వాత సొమ్మసిల్లి పడిపోవడంతో ఆ రోజు పేకప్ చెప్పి వెళ్లిపోయారు. ఆ తర్వాత మళ్లీ ఎవరూ అక్కడికి వెళ్లలేదు. అయితే, ఆ నటి పేరును మాత్రం ఆ టీమ్ వెల్లడించలేదు. అయితే గతంలో ఓ సారి అక్కడ కమ్యా పంజాబీ (సిందూర్​ సింగ్​) అనే సీరియల్​ను అక్కడ షూట్​ చేశారు.  అయితే ఆ షూటింగ్​లో పాల్గొన్న ఓ బాలనటి మాత్రం మగాడి గొంతుతో అరుస్తూ అక్కడి నుంచి వెళ్లిపోవాలని చిత్ర యూనిట్​ను హెచ్చరించింది. దీంతో షూటింగ్​ను నిలిపివేశారు. బాలీవుడ్​ నటి బిపాసబసు ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘గుణ్హా’ చిత్రాన్ని ముఖేష్ మిల్స్‌లోనే చిత్రీకరించారు. ఆ ప్రాంతంలో ఏవో వింతశబ్ధాలు వినిపించినట్టు బిపాసా చెప్పారు.

ముఖేష్ మిల్స్‌ కథ ఇదీ..!

ముంబయిలోని కొలాబా ప్రాంతంలో 1870లో ముఖేష్ మిల్స్​ ను   ప్రారంభించారు. 1875 లో దీన్ని మరింత విస్తరించారు. వేలాది మంది ఇక్కడ ఉపాధి పొందేవారు. అయితే 1982లో ఇక్కడ భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకున్నది. దీంతో ఆ భవనం శిథిలావస్థకు చేరుకున్నది. కానీ ముఖేశ్​ మిల్స్​ ఎంతో అందమైన కట్టడం.. అమితాబ్​ బచ్చన్​ నటించిన ‘హమ్’ సినిమాలో ‘చుమ్మా చుమ్మా దేదే’ పాటను ఇక్కడే చిత్రీకరించారు. అప్పటినుంచి  ఈ పాడుబడ్డ భవంతిపై బాలీవుడ్​ కన్ను పడింది. అడపదడపా ఇక్కడ షూటింగ్​ లు చేస్తున్నారు. ఇటీవల హర్రర్​ సినిమాలకు గిరాకీ పెరగడం తో అందరి దృష్టి ముఖేశ్​ మిల్స్​పై పడింది. అయితే అక్కడ ఎందుకు వింతశబ్ధాలు వస్తున్నాయి అన్న విషయం మిస్టరీగానే మిగిలిపోయింది.
Tags:    

Similar News