నేను సుశాంత్ సింగ్ తో అందుకే విడిపోయా

Update: 2021-03-23 17:30 GMT
దివంగ‌త న‌టుడు సుశాంత్ సింగ్‌, ఆయ‌న ప్రియురాలు అంకితా లోఖండే దాదాపు ఏడు సంవ‌త్స‌రాల సుదీర్ఘ‌మైన డేటింగ్ త‌ర్వాత విడిపోయారు. వీరిద్ద‌రూ విడిపోవ‌డం ప‌ట్ల‌ ఫ్యాన్స్ ను కూడా క‌ల‌త చెందారు. కానీ.. ఎందుకు విడిపోయారు అనే కార‌ణం మాత్రం ప్ర‌పంచానికి తెలియ‌లేదు. తాజాగా.. ఈ విష‌య‌మై నోరువిప్పారు అంకితా.

అప్పట్లో ప్రసారమైన 'ప‌విత్ర రిష్ట‌' అనే టీవీ సీరియల్ లో లీడ్ రోల్స్ ప్లే చేసిన సుశాంత్-అంకిత.. అప్పుడే నుంచే ప్రేమలో పడ్డారు. అత్యంత ప్రజాదరణ పొందిన టీవీ సీరియల్లో పవిత్ర రిష్ట ఒకటి. వీరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ అద్భుతంగా ఉంద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మైంది. ఆ విధంగా ఏడేళ్ల‌పాటు వీరు డేటింగ్ చేశారు. ఆ త‌ర్వాత పెళ్లి చేసుకోవాల‌ని కూడా నిర్ణ‌యించుకున్నారు.

తాను సుశాంత్ ను ప్రాణం కన్నా ఎక్కువ‌గా ప్రేమించాన‌ని చెప్పారు అంకితా. అత‌ని కోసం త‌న కెరీర్ ను కూడా త్యాగం చేశాన‌ని చెప్పారు. షారూక్ ఖాన్ న‌టించిన 'హ్యాపీ న్యూఇయ‌ర్‌' సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన బాజీరావ్ మస్తానీ, సల్మాన్ ఖాన్ 'సుల్తాన్' వంటి సినిమాల ఆఫర్లను కేవలం సుశాంత్ కోసమే వదులుకున్నట్టు చెప్పారు. అంతేకాకుండా.. వ‌రున్ ధావ‌న్ ఓ సారి ఫోన్ చేసి త‌న 'బద్లాపూర్' చిత్రంలో న‌టించాల‌ని కూడా కోరాడ‌ని, కానీ.. దాన్ని కూడా సున్నితంగా తిర‌స్క‌రించార‌ని చెప్పారు అంకితా.

కేవ‌లం సుశాంత్ ను పెళ్లి చేసుకునేందుకే ఈ అవ‌కాశాల‌ను వ‌దులుకున్న‌ట్టు చెప్పారు. కానీ.. సుశాంత్ మాత్రం త‌న కెరీర్ ను మాత్ర‌మే ప్రేమించాడ‌ని వెల్ల‌డించింది. త‌న కెరీర్ ను తాను చూసుకున్నాడ‌ని చెప్పుకొచ్చింది. అయితే.. తాను ఇక్క‌డ ఎవ‌ర్నీ నిందించ‌డం లేద‌ని చెప్పిన అంకితా.. సుశాంత్ స్ప‌ష్ట‌మైన అభిప్రాయంతో ఉన్నాడ‌ని తెలిపింది. నా మార్గం వేరే.. అత‌ని మార్గం వేర‌ని తెలిసింద‌ని, ఈ కార‌ణం చేత‌నే విడిపోవాల్సి వ‌చ్చింద‌ని ప‌రోక్షంగా వెల్ల‌డించారు.
Tags:    

Similar News