పవన్‌ చేయబోతున్న ఆ రీమేక్‌ సింగిల్‌ స్టారర్‌ గా మారడం లేదు

Update: 2020-11-17 05:15 GMT
పవన్‌ కళ్యాణ్‌ ఇప్పటికే మలయాళ సూపర్‌ హిట్‌ మూవీ అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌ రీమేక్‌ కు ఓకే చెప్పాడు. సితార ఎంటర్‌ టైన్‌ మెంట్స్‌ బ్యానర్‌ లో ఈ రీమేక్‌ నిర్మాణం జరుగబోతుంది సాగర్‌ చంద్ర దర్శకత్వంలో రూపొందబోతున్న ఈ సినిమాకు రచన సహకారం త్రివిక్రమ్‌ అందించబోతున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి. పింక్‌ సినిమాను రీమేక్‌ చేస్తున్న పవన్‌ కళ్యాణ్‌ కోసం పలు మార్పులు చేర్పులు చేశారు. కమర్షియల్‌ మూవీగా పింక్‌ ను మార్చి వకీల్‌ సాబ్‌ గా రూపొందిస్తున్నారు. ఇప్పుడు అదే పద్దతిని అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌ కు కూడా వర్తింపజేస్తున్నారనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌ మూవీ మల్టీ స్టారర్‌. కాని తెలుగులో రీమేక్‌ గా రూపొందబోతున్న సినిమా మాత్రం సింగిల్‌ స్టారర్‌ గా మారబోతుంది అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. పవన్‌ కోసం మల్టీ స్టారర్‌ కథను సింగిల్‌ స్టారర్‌ గా మార్చినట్లుగా జరుగుతున్న ప్రచారంకు యూనిట్‌ సభ్యులు అనధికారికంగా చెక్‌ పెట్టారు. మలయాళంలో ఇద్దరు హీరోలకు ఎలాంటి ప్రాముఖ్యత.. ఎంతటి ప్రాముఖ్యత అయితే ఉందో అలాగే రీమేక్‌ లో కూడా ఉంటుందని అన్నారు. పవన్‌ కు సమానమైన ప్రాముఖ్యత మరో హీరోకు ఉంటుందని అంటున్నారు. దాంతో పవన్‌ చేయబోతున్న రీమేక్‌ మల్టీస్టారర్‌ మూవీనే అని క్లారిటీ వచ్చేసింది. మరి ఆ మరో హీరో ఎవరు అనేది క్లారిటీ రావాల్సి ఉంది.
Tags:    

Similar News