MRP టీజర్ టాక్: ముగ్గురు మిత్రులు.. ఒకటే మ్యాడ్‌నెస్..

టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఈ మధ్యకాలంలో పక్కా కామెడీ ఎంటర్టైనర్లు తగ్గిపోయాయి. సీరియస్ డ్రామాలు, యాక్షన్ సినిమాల మధ్యలో హాయిగా నవ్వుకునే సినిమాలు అప్పుడప్పుడు వస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాయి.;

Update: 2026-04-22 08:01 GMT

టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఈ మధ్యకాలంలో పక్కా కామెడీ ఎంటర్టైనర్లు తగ్గిపోయాయి. సీరియస్ డ్రామాలు, యాక్షన్ సినిమాల మధ్యలో హాయిగా నవ్వుకునే సినిమాలు అప్పుడప్పుడు వస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా విడుదలైన ‘MRP: నీకెంత? నాకెంత?’ టీజర్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. టైటిల్ తోనే క్యూరియాసిటీ పెంచిన మేకర్స్, ఇప్పుడు టీజర్ తో సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో హింట్ ఇచ్చేశారు. చాలా రోజుల తర్వాత ఒక పర్ఫెక్ట్ యూత్ ఫుల్క్ క్రైమ్ కామెడీ సినిమా వస్తోందనే ఫీలింగ్ ఈ టీజర్ కలిగిస్తోంది.




 


ప్రముఖ నిర్మాత సాహు గారపాటి చేతుల మీదుగా విడుదలైన ఈ టీజర్ చూస్తుంటే, సినిమా మొత్తం ముగ్గురు స్నేహితుల చుట్టూ తిరిగే గందరగోళంలా అనిపిస్తోంది. నరేష్ అగస్త్య, రాజ్ కుమార్ కసిరెడ్డి, సుదర్శన్ ఈ ముగ్గురి కాంబినేషన్ టీజర్ లో హైలైట్ గా నిలిచింది. టీజర్ మొదట్లోనే "మన కల కోసం మనం పని చేయకపోతే.. వేరే వాళ్ల కల కోసం మనం పని చేయాల్సి వస్తుంది" అనే డైలాగ్ వినడానికి సీరియస్ గా ఉన్నా, ఆ తర్వాత వచ్చే సీన్లు మాత్రం ఫుల్ ఫన్ తో సాగాయి.

ముగ్గురు మిత్రులు కలిసి చేసే హడావుడి, వారి కామెడీ టైమింగ్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. ముఖ్యంగా టీజర్ చివర్లో వచ్చే కిడ్నాప్ డ్రామా సీన్ భలే నవ్వు తెప్పిస్తోంది. కిడ్నాప్ కాదు ‘రాన్సమ్’ అని ఒకరంటే.. అది ‘హ్యాండ్సమ్’ కాదురా ‘రాన్సమ్’ అని ఇంకొకరు తిట్టడం, దానికి తెలుగులో అర్థం ఏంటని అడిగితే.. "వాళ్ల వస్తువును వాళ్లకు తిరిగి ఇచ్చేయడం" అని చెప్పే డైలాగ్ ఈ సినిమా టోన్ ఏంటో చెప్పేస్తోంది.

సినిమాలో వెన్నెల కిషోర్ వంటి సీనియర్ కామెడీ నటులు కూడా ఉండటంతో వినోదానికి ఎక్కడా లోటు ఉండదనిపిస్తోంది. ముఖ్యంగా నరేష్ అగస్త్య బాడీ లాంగ్వేజ్ చాలా డిఫరెంట్ గా, మాస్ కి దగ్గరగా ఉంది. శ్రవణ్ జెస్టా దర్శకత్వం వహిస్తూ స్వయంగా నిర్మించిన ఈ చిత్రంలో విజువల్స్ చాలా కలర్ ఫుల్ గా ఉన్నాయి. అజయ్ అరసాడ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ టీజర్ లోని మ్యాడ్‌నెస్ కు పర్ఫెక్ట్ గా సెట్ అయ్యింది.

చిన్న సినిమా అయినా ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్కడా రాజీ పడకుండా గ్రాండ్ గానే కనిపిస్తున్నాయి. కేవలం కామెడీ మాత్రమే కాకుండా, అక్కడక్కడా యాక్షన్ సీక్వెన్స్ లు కూడా ఉండటం చూస్తుంటే, ఇదొక కంప్లీట్ మాస్ అండ్ ఫన్ ప్యాకేజీ లా అనిపిస్తోంది. ఇలాంటి విభిన్నమైన కాన్సెప్ట్ తో వచ్చే సినిమాలు క్లిక్ అయితే బాక్సాఫీస్ వద్ద చిన్న సినిమాలకు మంచి బూస్ట్ దొరుకుతుంది.

ఫైనల్ గా ‘MRP’ టీజర్ తో సినిమాపై పాజిటివ్ వైబ్స్ మొదలయ్యాయి. యూత్ కు కనెక్ట్ అయ్యే డైలాగ్స్, ప్రాక్టికల్ గా ఉండే కామెడీ సీన్లు ఈ చిత్రానికి ప్రధాన బలం కానున్నాయి. సినిమా రిలీజ్ తర్వాత కూడా ఇదే రకమైన ఫన్ ఉంటే మాత్రం థియేటర్లలో నవ్వుల సందడి ఖాయం. నరేష్ అగస్త్య కెరీర్ కి ఈ సినిమా ఒక ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ అయ్యేలా కనిపిస్తోంది. త్వరలోనే సినిమా రిలీజ్ డేట్ పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మరి ఈ ముగ్గురు మిత్రులు థియేటర్లలో ఎలాంటి మ్యాజిక్ చేస్తారో వేచి చూడాలి.



Full View


Tags:    

Similar News