వంశీ పైడిప‌ల్లి మాట స‌ల్మాన్ ఖాన్ వింటాడా?

న‌య‌న‌తార హీరోయిన్, కీల‌క పాత్ర‌ల్లో అనిల్ క‌పూర్‌, అర‌వింద‌స్వామి న‌టిస్తార‌ని వార్త‌లు షికారు చేస్తున్నాయి.;

Update: 2026-04-22 10:50 GMT

గ‌త రెండు మూడేళ్లుగా స‌రైన హీరో ల‌భించ‌క కొత్త ప్రాజెక్ట్‌ని ప్రారంభించ‌లేక స‌త‌మ‌త‌మ‌వుతూ వ‌చ్చారు టాలీవుడ్ డైరెక్ట‌ర్ వంశీ పైడిప‌ల్లి. మహేష్‌, రామ్ చ‌ర‌ణ్‌, అల్లు అర్జున్‌..ఇలా స్టార్ హీరోల‌తో సినిమాలు చేయాల‌ని వేచి చూశారు. అయితే ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితుల్లో ఏ స్టార్ హీరో కూడా ఖాలీగా లేక‌పోవ‌డం, మ‌రి కొంత కాలం వేయిట్ చేయాల్సిన ప‌రిస్థితులు త‌లెత్త‌డంతో ఫైన‌ల్‌గా బాలీవుడ్ కండ‌ల వీరుడు స‌ల్మాన్ ఖాన్‌తో సినిమాకు రెడీ అయిపోయారు. దిల్ రాజు బ్యాన‌ర్‌లో అత్యంత భారీ బ‌డ్జెట్‌తో ఈ మూవీని ప్లాన్ చేశారు.

న‌య‌న‌తార హీరోయిన్, కీల‌క పాత్ర‌ల్లో అనిల్ క‌పూర్‌, అర‌వింద‌స్వామి న‌టిస్తార‌ని వార్త‌లు షికారు చేస్తున్నాయి. దాదాపుగా వారే ఫైన‌ల్ అవుతార‌ని ఇన్ సైడ్ టాక్‌. ఇదిలా ఉంటే ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ ఈ రోజే లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. ముంబైలో ప్ర‌త్యేకంగా వేసిన ఇంటి సెట్‌లో ఈ సినిమాకు సంబంధించిన కీల‌క స‌న్నివేశాల‌తో షూటింగ్ మొద‌లు పెట్టారు. పాన్ ఇండియా స్థాయిలో అత్యంత భారీగా రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు. వ‌చ్చే ఏడాది 2027 ఈద్‌కు ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాల‌న్న‌ది మేక‌ర్స్ టార్గెట్‌.

ముంబై గోరేగావ్‌లో ఉన్న ఎస్ ఆర్ పీఎస్ గ్రౌండ్స్‌లో ప్ర‌త్యేకంగా ఓ ఇంటి సెట్‌ని వేశారు. అందులోనే ఈ మూవీ షూటింగ్‌ని మొద‌లు పెట్టారు. హైవోల్టేజ్ యాక్ష‌న్ డ్రామాగా దీన్ని వంశీ పైడిప‌ల్లి రూపొందిస్తున్నాడ‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు అంటున్నాయి. అంతా బాగానే ఉంది. కానీ స‌ల్మాన్ ఖాన్ డైరెక్ట‌ర్ వంశీ పైడిప‌ల్లి మాట వింటాడా? అనే చ‌ర్చ టాలీవుడ్‌లో జ‌రుగుతోంది. దీనికి ముందు స‌ల్మాన్ ఖాన్ `సికింద‌ర్‌`లో న‌టించాడు. ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌గా న‌టించిన ఈ మూవీకి ఏ.ఆర్‌. మురుగ‌దాస్ డైరెక్ట‌ర్‌.

గ‌త ఏడాది విడుద‌లైన ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద దారుణంగా విఫ‌ల‌మైన విష‌యం తెలిసిందే. అయితే ఈ ఫ్లాప్‌కి ప్ర‌ధాన కార‌ణం స‌ల్మాన్ ఖాన్ బిహేవియ‌రే అని ద‌ర్శ‌కుడు ఏ.ఆర్‌. మురుగ‌దాస్ ఇటీవ‌ల సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌డం తెలిసిందే. ఈ ఉదంతం త‌రువాత వంశీ పైడిప‌ల్లితో క‌లిసి వ‌ర్క్ చేస్తున్న స‌ల్మాన్ ఖాన్ త‌న మాట వింటాడా? అనే చ‌ర్చ స‌ర్వ‌త్రా జ‌ర‌గుతోంది. టైమ్‌కు సెట్‌కు రాని స‌ల్మాన్‌తో వంశీ పైడిప‌ల్లి ఈ మూవీని ఎలా నూర్తి చేస్తాడ‌ని అంతా వాపోతున్నారు. ప్ర‌స్తుతం ఉన్న విప‌త్క‌ర ప‌రిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని స‌ల్మాన్ ఖాన్ త‌న పంథా మార్చుకుని షూటింగ్ కు స‌హ‌క‌రిస్తే సినిమా నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంద‌ని చెబుతున్నారు.



Tags:    

Similar News