ఓటీటీ రిలీజుల పట్ల హీరోలు హ్యాపీగా ఉండటానికి కారణం అదే..!

Update: 2020-11-28 04:00 GMT
డిజిటల్ యుగంలో టెక్నాలజీ - స్మార్ట్‌ ఫోన్‌ - టీవీ - ఇంటర్నెట్‌ వినియోగం పెరిగిన తర్వాత అందరూ ఓటీటీలపై వైపు పయనించడం మొదలు పెట్టారు. కరోనా సంక్షోభం ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్స్ ని ప్రేక్షకులకు మరింత దగ్గర చేసింది. లాక్‌ డౌన్‌ తో అమెజాన్‌ ప్రైమ్ - నెట్‌ ప్లిక్స్ - ఆహా - సన్‌ నెక్స్ట్‌ - డిస్నీ+ హాట్‌ స్టార్‌ - జీ5 వంటి ఓటీటీ లు తమ సత్తా చాటాయి. గత కొన్ని నెలలుగా థియేటర్స్ క్లోజ్ అయి ఉండటంతో ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న సినిమాలు ఓటీటీలను ఆశ్రయించాయి. సూర్య - నాని - అనుష్క - కీర్తి సురేష్ వంటి స్టార్స్ నటించిన సినిమాలు కూడా డైరెక్ట్ ఓటీటీ పద్ధతిలో రిలీజ్ అయ్యాయి. ఈ క్రమంలో కొన్ని సినిమాలు మంచి టాక్ తెచ్చుకోగా, మరికొన్ని నెగెటివ్ ఫీడ్ బ్యాక్ అందుకున్నాయి. కాకపోతే ఓటీటీ రిలీజ్ వల్ల ఫలితం ఎలా ఉన్నా మేకర్స్ మాత్రం సేఫ్ జోన్ లో ఉంటున్నారు.

అంతేకాకుండా డైరెక్ట్ ఓటీటీ విడుదల వల్ల హీరోలు కూడా హ్యాపీగా ఉంటున్నారని తెలుస్తోంది. దీనికి స్పెష‌ల్ రీజ‌న్ ఏంటంటే డిజిటల్ రిలీజ్ కి ఓపెనింగ్ టెన్ష‌న్ అవ‌స‌రం లేదు. అలానే థియేట‌ర్ కి ఫస్ట్ డే రోజున జ‌నాలు వ‌స్తారో రారో అనే భ‌యం అవ‌స‌ర‌మే లేదు. ప‌లానా ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ లో సినిమా విడుద‌ల అవుతుంద‌నే విష‌యం ఆడియెన్స్ కి తెలియ‌జేస్తే స‌రిపోతుంది. ఒకవేళ మూవీ నెగెటివ్ టాక్ తెచ్చుకున్నా ముందుగానే ప్రొడ్యూసర్ ప్రాఫిట్ లో ఉంటాడు. ప్ర‌తి ఇంటిలో ఉండే సినీ అభిమానులు ఓటీటీలో ఏ హీరో సినిమా రిలీజైనా చూస్తున్నారు. భాషతో సంబంధం లేకుండా అన్ని రకాల సినిమాలని చూస్తున్నారు. ఇలాంటి కారణాలతోనే చాలా మంది హీరోలు ఓటీటీ రిలీజుల పట్ల హ్యాపీగా ఉండటంతో పాటు వాటికి స‌పోర్ట్ చేస్తున్నారని తెలుస్తోంది.
Tags:    

Similar News