త్రిమూర్తుల సెల్ఫీ అదిరిందిగా
ఇప్పటికే RRR అంటూ రాజమౌళి-రామారావు-రామ్ చరణ్ గురించి టాపిక్ ట్రెండింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే. షూటింగ్ మొదలు కావడానికి ఇంకా చాలా టైం ఉన్నా దాని గురించిన చర్చలు మాత్రం మహా జోరుగా ఉన్నాయి. ఇప్పుడు అలాంటిదే మరొకటి తెరపైకి వచ్చేసింది. అదే TTT. అదేనండి. త్రివిక్రమ్-తారక్-తమన్. ఈ క్రేజీ కాంబోలో రూపొందనున్న కొత్త సినిమా షూటింగ్ ఈ నెలలోనే మొదలుకానున్న సంగతి తెలిసిందే. పూజా కార్యక్రమాలు గతంలోనే చేసినప్పటికి తారక్ మేకోవర్ కోసం ఇంత కాలం వాయిదా వేసారు. ఎవరు ఊహించని రేంజ్ లో జూనియర్ ఎన్టీఆర్ తన ఫిజిక్ ను మార్చుకోవడంతో సెట్స్ పైకి వెళ్ళడానికి రంగం సిద్ధమయ్యింది. మ్యూజిక్ సిట్టింగ్స్ ఈపాటికే మొదలైపోయాయి కూడా.
ఈ సందర్భంగా ఈ ముగ్గురు కలిసి తీసుకున్న సెల్ఫీ పిచ్చ వైరల్ అవుతోంది. టాలీవుడ్ లో ఎప్పటి నుంచో మాటల మాంత్రికుడితో యంగ్ టైగర్ కాంబినేషన్ కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఇన్నాళ్ళకు వాళ్ళ కోరిక నెరవేరబోతోంది. దానికి తోడు జూనియర్ ని గతంలో చూడని సరికొత్త పాత్రలో త్రివిక్రమ్ ప్రెజెంట్ చేయబోతున్నాడు అనే వార్త ఫాన్స్ ని కుదురుగా ఉండనివ్వడం లేదు. పూజా హెగ్డే హీరొయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో కీలక పాత్రలు చాలానే ఉండబోతున్నట్టు టాక్. ఊహకందని కాంబోలు ఇందులో ఉంటాయట. దసరాలోపు షూటింగ్ పూర్తి చేసేలా ప్లానింగ్ లో ఉంది హారికా అండ్ హాసిని యూనిట్. ఒకవేళ అప్పటికి పూర్తి కాకపోతే దీపావళి టైంలో విడుదల చేయొచ్చు. తన సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దాకా అన్ని గుట్టుగా మైంటైన్ చేసే త్రివిక్రమ్ ఈ సినిమాకు కూడా అదే ఫాలో కానున్నట్టు టాక్.
తారక్ లుక్ ఎలా ఉంటుందా అనే సస్పెన్స్ కు ఐపిఎల్ యాడ్స్ రాకముందే సస్పెన్స్ ఈ సెల్ఫీ ద్వారా తొలగిపోయింది. వాటి కోసం కూడా త్రివిక్రమ్-తారక్ కలిసే పని చేసారు. ఇటీవలే హైదరాబాద్ అవుట్ స్కర్ట్స్ లో వీటి షూటింగ్ కూడా పూర్తి చేసారు. ఈ రోజో రేపో టీవీ తెరలపై ఇవి ప్రత్యక్షం కాబోతున్నాయి. చూద్దాం మరి.