• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బాలయ్య రేంజ్‌ కు...

బాలయ్య రేంజ్‌ కు తగ్గట్లుగా వాయించుడు

By - Tupaki Desk
Update: 2021-07-27 12:30 GMT
నందమూరి బాలకృష్ణ మాస్‌ ఇమేజ్‌ కు తగ్గట్లుగా ఒక మంచి కథ పడి.. దర్శకుడు ఆ కథను మంచి మాస్‌ స్క్రీన్‌ ప్లేతో తెరకెక్కించి.. మాంచి మాస్‌ ట్యూన్స్ దొరికితే ఆయన సినిమాకు తిరుగు ఉండదు అంటూ గతంలో పలు సార్లు నిరూపితం అయ్యింది. ఆయనకు తగ్గట్లుగా కథలను ఎంపిక చేయడంలో కొందరు నిరాశ పర్చుతున్నారు. బాలయ్య పవర్ ఫుల్‌ మాస్ కథలకు పూర్తిగా న్యాయం చేయగలరు. కనుక ఆయనకు తగ్గట్లుగా అఖండ సినిమాను బోయపాటి ప్రేక్షకులముందుకు తీసుకు వచ్చే ప్రయత్నాలు చేస్తున్నాడు.

బాలయ్య మరియు బోయపాటి కాంబో సినిమా తర్వాత గోపీచంద్‌ దర్శకత్వంలో సినిమా ఉంది. బాలయ్య.. గోపీచంద్ ల కాంబో మూవీ ఇప్పటికే పట్టాలెక్కాల్సి ఉన్నా కూడా కరోనా సెకండ్‌ వేవ్‌ వల్ల కాస్త ఆలస్యం అయ్యింది. క్రాక్‌ సినిమా తో సూపర్‌ హిట్‌ ను దక్కించుకుని జోరు మీదున్న గోపీచంద్‌ వెంటనే బాలయ్యతో సినిమాను చేసేందుకు సిద్దం అయ్యాడు.

క్రాక్‌ మాదిరిగానే యదార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను బాలయ్య హీరోగా గోపీచంద్‌ మలినేని తెరకెక్కించేందుకు స్క్రిప్ట్‌ సిద్దం చేశాడు. తమిళనాడులో ప్రస్తుతం అఖండ సినిమా షూటింగ్‌ లో పాల్గొంటున్న బాలయ్య త్వరలోనే గోపీచంద్‌ మూవీ సినిమా ను మొదలు పెట్టబోతున్నాడు. బాలకృష్ణ మరియు గోపీచంద్ ల కాంబో మూవీకి సంగీతాన్ని థమన్ అందించబోతున్నాడు. క్రాక్ సినిమా కు గాను థమన్‌ అందించిన సంగీతం కు ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్‌ స్కోర్‌ కు విమర్శకుల ప్రశంసలు దక్కాయి.

అద్బుతమైన బ్యాక్ గ్రౌండ్‌ ను ఈమద్య కాలంలో వరుసగా ఇస్తున్న దర్శకుడు థమన్‌ బాలయ్య సినిమాకు అంతకు మించి అన్నట్లుగా ఇస్తానంటూ ధీమాగా చెబుతున్నాడు. బాలయ్య మాస్ ఇమేజ్ ను మరింతగా పెంచే విధంగా మాస్ బీట్స్ ను బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్ ను ఇవ్వాలని థమన్‌ పట్టుదలతో కనిపిస్తున్నాడు.

బాలయ్య తో వచ్చిన ఈ అవకాశంను సద్వినియోగం చేసుకుని టాలీవుడ్‌ లో టాప్‌ స్టార్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ గా నిలవాలనే ఉద్దేశ్యంతో పట్టుదలగా ఈ సినిమాకు బ్యాక్ గ్రౌండ్‌ స్కోర్ ను అందిస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం టాలీవుడ్‌ లో టాప్‌ స్టార్‌ హీరోలకు మోస్ట్‌ వాంటెడ్‌ సంగీత దర్శకుడు థమన్‌. హీరోలు తనపై పెట్టుకున్న నమ్మకంను సాధ్యం అయినంత వరకు నిలపుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. అందుకు అనుగుణంగానే ఆయన ప్రతి సినిమాకు కూడా సంగీతాన్ని అందిస్తున్నాడు.

గత ఏడాది వచ్చిన అల వైకుంఠ పురంలో సినిమా తో బ్లాక్ బస్టర్ ను దక్కించుకున్నాడు. ఇప్పటికి కూడా ఆ పాటలు మారు మ్రోగుతున్నాయి అనడంలో సందేహం లేదు. అంతగా సక్సెస్‌ అయిన థమన్‌ ప్రస్తుతం పెద్ద సినిమాలే అరడజను చేస్తున్నాడు. అయినా కూడా ఏ ఒక్క సినిమా విషయంలో లైట్ తీసుకోకుండా ప్రతి సినిమా కు కూడా ది బెస్ట్ ఇవ్వాలనే ప్రయత్నాలు చేస్తున్నాడు. బాలయ్య.. గోపీచంద్‌ మలినేని కాంబో మూవీ మాస్ ఎలిమెంట్స్‌ ఓవర్‌ లోడెడ్‌ గా ఉండబోతుందట. కనుక తన బ్యాక్ గ్రౌండ్‌ స్కోర్ ను కూడా అలాగే ప్లాన్‌ చేస్తున్నాడట. తన బీజీతో సినిమా మాస్ స్థాయిని మరింతగా పెంచేలా థమన్ ప్లాన్ చేస్తున్నాడట.

చిరంజీవి.. పవన్‌ కళ్యాణ్‌.. రామ్‌ చరణ్‌.. మహేష్‌ బాబు ఇలా టాలీవుడ్ బడా హీరోల సినిమా లకు ప్రస్తుతం థమన్‌ సంగీతాన్ని అందిస్తున్నాడు. బాలీవుడ్ మరియు కోలీవుడ్‌ నుండి కూడా ఈయనకు ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. చేతిలో పది సినిమాలకు పైగా పెట్టుకుని ఎప్పుడు బిజీగా ఉండే థమన్‌ బాలయ్య మాస్ ఇమేజ్‌ ను ఏ రేంజ్ లో మ్యాచ్‌ చేస్తూ తన బీజీని ఇస్తాడో చూడాలి.
Tags:    
  • SS Thaman 
  • Balakrishna 
  • Gopichand Malineni 
  • Music Director 
  • Tollywood 
  • Movie News 
  • Latest News 
  • Telugu News 

Similar News

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

నేపో కిడ్స్ వ‌ల్ల‌నే ఈ యువ‌న‌టుడికి ఛాన్సుల్లేవా? వెక్కి వెక్కి ఏడ్చాడు!

2026-11-19 08:08 GMT

Copyright @2026

Powered by Blink CMS