ప్రభాస్‌ తో మూవీ 10 ఏళ్ల క్రితం చేజారింది.. అప్పటి నుండి ఎదురు చూపులే

Update: 2021-11-27 02:30 GMT
ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా సూపర్‌ స్టార్‌ ఇమేజ్ ను దక్కించుకున్నాడు. హీరోగా ఆయన చేస్తున్న సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా రేంజ్ లో ఉంటున్నాయి. ప్రాజెక్ట్‌ కే మరియు స్పిరిట్ సినిమాలు పాన్ ఇండియాను మించి అన్నట్లుగా రూపొందుతున్నాయి. ప్రభాస్ వంటి సూపర్‌ స్టార్‌ సినిమాకు వర్క్‌ చేసే అవకాశం వస్తే ఏ టెక్నీషియన్ అయినా మంచి గుర్తింపు దక్కించుకోవడం ఖాయం. అందుకే ప్రభాస్ సినిమాలో నటించాలని ప్రతి ఒక్కరు కోరుకుంటూ ఉంటారు. ప్రభాస్ తో ఒక్క సినిమానైనా తీయాలని ఎంతో మంది దర్శకులు ఎదురు చూస్తున్నారు. ఆయన సినిమాకు సంగీతాన్ని అందించాలని బాలీవుడ్‌ స్టార్‌ మ్యూజిక్‌ కంపోజర్స్ కూడా కోరుకుంటూ ఉంటారు. ఆ అకాశం మాత్రం కొద్ది మందికే లభిస్తుంది. ప్రభాస్ సినిమాకు సంగీతం అందించే అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారింది. పదేళ్ల క్రితం మిస్ అయిన ఆఫర్ కోసం ఇన్నాళ్లు వెయిట్‌ చేస్తున్నట్లుగా చెప్పుకొచ్చాడు.

ప్రస్తుతం సౌత్‌ లో థమన్‌ స్టార్‌ మ్యూజిక్‌ కంపోజర్‌. స్టార్‌ హీరోల సినిమాలకు ఆయన సంగీతాన్ని అందిస్తూ బిజీ బిజీగా ఉన్నాడు. చిరంజీవి.. పవన్ కళ్యాణ్‌.. మహేష్‌ బాబు.. బన్నీ.. ఎన్టీఆర్‌.. ఇలా ఎంతో మంది స్టార్ హీరోలకు మరియు చిన్న హీరోలకు కొత్త హీరోలకు సంగీతాన్ని అందిస్తు తక్కువ సమయంలోనే సెంచరీకి థమన్ చేరువ అయ్యాడు. కాని ఇప్పటి వరకు ప్రభాస్ సినిమాకు మాత్రం థమన్ సంగీతాన్ని అందించలేక పోయాడు. ఇప్పుడంటే ఆయన పాన్‌ ఇండియా స్టార్‌ కాని.. మిర్చికి ముందు వరకు ప్రభాస్ ఒక సాదారణ స్టార్‌. అప్పుడు కూడా ప్రభాస్ సినిమా లకు థమన్‌ వర్క్‌ చేసే అవకాశాన్ని దక్కించుకోలేక పోయాడు.

తాజాగా ఈ విషయమై థమన్ మాట్లాడుతూ ప్రభాస్ నటించిన రెబల్‌ సినిమాకు సంగీతం అందించే అవకాశం వచ్చింది. రెబల్‌ మ్యూజిక్ వర్క్ కూడా ప్రారంభించిన కొన్ని రోజుల తర్వాత ఆ సినిమాకు తానే సంగీతాన్ని చేస్తానంటూ లారెన్స్‌ చెప్పాడు. దాంతో నేను ఆ సినిమా నుండి తప్పుకున్నాను. అప్పటి నుండి ప్రభాస్ మూవీ కి సంగీతాన్ని అందించే అవకాశం రాలేదు. మళ్లీ మళ్లీ ఆయన సినిమాలకు వర్క్ చేసే అవకాశాల కోసం ఎదురు చూస్తున్నట్లుగా థమన్‌ చెప్పుకొచ్చాడు. ఇప్పుడు కాకున్నా ముందు ముందయినా ప్రభాస్ సినిమాకు మ్యూజిక్ కంపోజ్‌ చేసే అవకాశం వస్తుందని ఆశిస్తున్నాను అంటూ థమన్‌ చెప్పుకొచ్చాడు. థమన్ మాట్లాడిన ఈ మాటలు ప్రభాస్ తో సినిమా చేసే మేకర్స్‌ ఎవరైనా వింటే ఖచ్చితంగా థమన్‌ పేరును పరిగణలోకి తీసుకునే అవకాశాలున్నాయంటూ సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
Tags:    

Similar News