• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ప్లీజ్‌ థమన్‌.. కాస్త...

ప్లీజ్‌ థమన్‌.. కాస్త ఊపిరి ఆడనివ్వరాదు మాకు

By - Tupaki Desk
Update: 2022-02-25 13:30 GMT
మ్యూజిక్ సెన్షేషన్‌ థమన్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ భీమ్లా నాయక్‌ రూపంలో పడింది. పవన్‌ కళ్యాణ్‌ మాస్ ఫాలోయింగ్‌ కు ఏమాత్రం తగ్గకుండా భీమ్లా నాయక్ లో ప్రతి సన్నివేశానికి కూడా అద్బుతమైన బీజీఎం ఇచ్చి సినిమా స్థాయిని మరింతగా పెంచాడు. థమన్‌ అఖండ సినిమా కు ఏ స్థాయిలో బీజీఎం ఇచ్చాడో తెల్సిందే. అఖండ కు ఏమాత్రం తగ్గకుండా.. అభిమానులు అంతకు మించి అనుకునేట్లుగా థమన్‌ భీమ్లా నాయక్ కు వాయించాడు.

భీమ్లా నాయక్ గురించి మాట్లాడిన ప్రతి ఒక్కరు కూడా ఆయన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఇదే సమయంలో సినిమాలోని పాటల గురించి కూడా ప్రధానంగా చర్చ జరుగుతోంది. సినిమా విడుదలకు ముందే పాటలను విడుల చేశారు. థమన్‌ ఆ పాటలతో సక్సెస్ దక్కించుకున్నాడు. భీమ్లా నాయక్ లో పాటలు సినిమా స్థాయిని మరింతగా పెంచే విధంగా ఉన్నాయంటూ టాక్ వచ్చింది.

అఖండ విడుదలై కొన్ని రోజులు అయ్యిందో లేదో వెంట వెంటనే భీమ్లా నాయక్‌.. సర్కారు వారి పాటలు వచ్చాయి. ఇప్పుడు భీమ్లా నాయక్ సినిమా వచ్చింది. ఈ హడావుడి కొనసాగుతున్న ఈ సమయంలోనే సర్కారు వారి పాట నుండి రెండవ పాట రాబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది. థమన్‌ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించడంతో అభిమానులు పూనకాలతో ఊగి పోతూ ఉన్నారు.

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు నుండి వచ్చిన సర్కారు వారి పాట సినిమా మొదటి సాంగ్ కళావతి ఎంతటి సెన్షేషన్ క్రియేట్‌ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సామాన్యుల నుండి సెలబ్రెటీల వరకు కళావతి డాన్స్ ను సోషల్‌ మీడియాలో చేస్తున్నారు. కళావతి హంగామా ఇంకా తగ్గనే లేదు. సోషల్‌ మీడియాలో కళావతి జోరు కొనసాగుతున్న ఈ సమయంలోనే సెకండ్‌ పాట విడుదల చేయబోతున్నట్లుగా థమన్‌ ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది.

కళావతి పాట ఒక అద్బుతం అంటూ అభిమానులు కితాబిస్తున్నారు. ఈసారి ఫుల్‌ మాస్ బీట్‌ తో మహేష్ బాబు అభిమానుల మైండ్‌ బ్లాస్ట్‌ చేసేందుకు థమన్‌ సిద్దం అవుతున్నాడని తెలుస్తోంది. రెండవ పాట పై అంచనాలు అంతకంతకు పెంచుతూ థమన్ ట్వీట్స్ చేస్తున్నాడు. ప్రతి పాట కూడా అద్బుతం కాని ఈ పాట అంతకు మించి అన్నట్లుగా ఉంటుందని యూనిట్‌ సభ్యులు కూడా అంటున్నారు.

మహేష్ బాబు ఇంట్రడక్షన్ సాంగ్‌ అనే వార్తలు వస్తున్నాయి. అసలు విషయం ఏంటీ అనే విషయమై క్లారిటీ రావాల్సి ఉంది. దర్శకుడు పరశురామ్‌ తో కలిసి ఉన్న ఫోటోను షేర్‌ చేసిన దర్శకుడు థమన్‌ రెండవ పాట బ్లాస్ట్‌ కి ఫ్యాన్స్ సిద్దంగా ఉండాలంటూ సూచించాడు. ప్రతి ఒక్క పాట కూడా ఈ సినిమా స్థాయిని పెంచే విధంగా ఉంటుందనే నమ్మకంతో అభిమానులు ఉన్నారు. థమన్‌ ఇలా బ్యాక్ టు బ్యాక్‌ కనీసం ఊపిరి కూడా తీసుకోనివ్వకుండా తన మ్యూజిక్ తో ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాడంటూ సోషల్‌ మీడియాలో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Tags:    
  • Thaman 
  • maheshbabu 
  • keetysuresh 
  • kalavathi 
  • sithara 
  • parasuram 
  • latestnews 

Similar News

రజినీకాంత్ తో భారీ సక్సెస్ కొట్టలేకపోయిన ఈ తరం స్టార్ డైరెక్టర్లు...

2026-11-02 11:30 GMT

రామాయణంపై అనవసరమైన సెటైర్లు ఎందుకు?

2026-11-02 11:02 GMT

అందరినీ మెప్పించలంటే.. ఐస్‌క్రీమ్ అమ్ముకోవాలా..!

2026-11-02 10:00 GMT

వెండితెర నుంచి రగ్బీ మైదానం వరకు!

2026-11-02 10:00 GMT

కోలీవుడ్ చరిత్రలో సరికొత్త అధ్యాయం!

2026-11-02 09:52 GMT

బడా స్టార్లకు కొత్త కథలు కరువయ్యాయా? స్పై యాక్షన్‌పై పెరుగుతున్న అసంతృప్తి!

2026-11-02 09:50 GMT

ప్రత్యక్షంగా కనిపించకపోయినా..అభిమానుల మనసు గెలుచుకున్న బాద్‌షా!

2026-11-02 09:49 GMT

మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి.. సాయి ధరమ్ తేజ్ నిశ్చితార్థం, పెళ్లి ముహూర్తలు ఇవే..!

2026-11-02 09:49 GMT

సల్మాన్ ఖాన్ స్టైల్‌లో మలైకా అరోరా రియాక్షన్!

2026-11-02 09:48 GMT

హీరోయిన్ క్యారెక్టర్ విషయంలో లెక్కలు తప్పకూడదు మాస్టర్..!

2026-11-02 08:25 GMT

సెలవుల దెబ్బకు తగ్గిన కలెక్షన్లు..అయినా రేసులో త‌గ్గ‌ని చిత్రాలు!

2026-11-02 07:35 GMT

ఇక నిర్మాతలు ముందే అన్ని చూసుకోవాల్సిందే.. లాస్ట్ మినిట్ ప్లానింగ్‌కు చెక్..!

2026-11-02 07:34 GMT

Copyright @2026

Powered by Blink CMS