లాంచనంగా దళపతి65 పూజా కార్యక్రమం!

Update: 2021-03-31 08:43 GMT
స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన 'మాస్టర్' సినిమా తర్వాత తదుపరి సినిమా ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మాస్టర్ సినిమాను దాదాపు ఏడాదిపాటు హోల్డ్ చేసి ఒక్కసారిగా బాక్సాఫీస్ మొత్తం కలెక్షన్స్ తో షేక్ చేసేసింది. ఇప్పటికి మాస్టర్ రిలీజై రెండు నెలలపైనే అవుతోంది. ఐతే దళపతి 65వ సినిమాగా తెరకెక్కనున్న తాజా మూవీకి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించనున్నాడు. భారీ అంచనాలు క్రియేట్ చేసిన ఈ కాంబినేషన్ మూవీకి ఈరోజే లాంచనంగా పూజా కార్యక్రమం చేశారు మేకర్స్. ఈ కార్యక్రమానికి దళపతి విజయ్ తో పాటు సినిమా నిర్మాతలు, డైరెక్టర్ టీమ్ అందరూ పాల్గొన్నారు. ప్రస్తుతం దళపతి65 పూజా కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సన్ పిక్చర్స్ నిర్మాణంలో తెరకెక్కనున్న ఈ సినిమా బడ్జెట్ కూడా భారీగానే ఉండబోతుందని సమాచారం. అలాగే ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్లో ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇక దళపతి విజయ్ సరసన ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే జతకట్టబోతుంది. ఇటీవలే హీరోయిన్ గా పూజ పేరును అధికారికంగా ప్రకటించారు మేకర్స్. మొత్తానికి మాస్టర్ విజయ్ త్వరలో పాన్ ఇండియా వైడ్ సందడి చేస్తాడని టాక్. ఎలాగో పూజాహెగ్డే ప్రభాస్.. రాధేశ్యామ్ సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్ గా పరిచయం కాబోతుంది. ఆల్రెడీ ఇటు తెలుగు అటు హిందీలో స్టార్డం తెచ్చుకున్న పూజా త్వరలోనే విజయ్ సినిమాతో తమిళంలో సత్తా చాటనుంది. ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. ఏప్రిల్ ఫస్ట్ వారంలో షూటింగ్ ప్రారంభం అవుతుందని ఇండస్ట్రీవర్గాల సమాచారం.
Tags:    

Similar News