కార్తితో `ఖైదీ`, కమల్ హాసన్ తో `విక్రమ్` వంటి సంచలన చిత్రాలని తెరకెక్కించి కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లోనూ క్రేజీ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు లోకేష్ కనగరాజ్. యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ గా మంచి గుర్తింపుని సొంతం చేసుకున్న లోకేష్ కనగరనాజ్ దక్షిణాదిలో తొలి సినిమాటిక్ యూనివర్స్ ని క్రియేట్ చేసి మల్టీవర్స్ సినిమాలకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్ నేపథ్యంలో `ఖైదీ`, `విక్రమ్` అని తెరకెక్కించిన లోకేష్ తాజాగా ఇదే యూనివర్స్ లో భాగంగా మరో సినిమాకు శ్రీకారం చుట్టాడు.
తమిళ క్రేజీ స్టార్ దళపతి విజయ్ కథానాయకుడిగా దళపతి 67ని ఇటీవలే మొదలు పెట్టిన విషయం తెలిసిందుఏ. చెన్నైలో లాంఛనంగా ఫార్మల్ పూజా జరుపుకున్న ఈ మూవీలో హీరో విజయ్ గ్యాంగ్ స్టర్ గా కనిపించబోతున్నాడు. లోకేష్ తో తనకు ఇది రెండవ సినిమా. ఇప్పటికే మల్టీవర్స్ లో భాగంగా `మాస్టర్`లో నటించిన విజయ్ దానికి కొనసాగింపుగా రూపొందుతున్న దళపతి 67లో నటిస్తున్నాడు. తనకు జోడీగా దాదాపు 13 ఏళ్ల విరామం తరువాత త్రష నటిస్తోంది.
సెవెన్ స్క్రీన్స్ స్టూడియోస్ బ్యానర్ పై లలిత్ కుమార్ నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం కశ్మీర్ లో జరుగుతోందని తెలిసింది. మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీని అందిస్తుండగా `విక్రమ్` బీజీఎమ్స్ తో సంచలనం సృష్టించిన అనిరుధ్ రవిచంద్రన్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నాడు. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ పవర్ ఫుల్ విలన్ పాత్రలో నటిస్తున్న ఈ మూవీలోని కీలక పాత్రల్లో అర్జున్, గౌతమ్ మీనన్, మన్సూర్ అలీఖాన్, ప్రియా ఆనంద్, మిస్కిన్, మాథ్యూ థామస్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
అండర్ ప్రొడక్షన్ లో వుండగానే మ్యూజిక్, ఓటీటీ, శాటిలైట్ హక్కుల్ని రికార్డు ప్రైజ్ కి లమ్మేశారు. విజయ్ నటించిన సినిమాల్లో ఈ మూవీ మ్యూజిక్, ఓటీటీ, శాటిలైట్ రైట్స్ విషయంలో రికార్డుని సొంతం చేసుకుందని తెలిసింది. ఇదిలా వుంటే ఈ మూవీ టైటిల్ ని శుక్రవారం సాయంత్రం ప్రకటించబోతున్నారు. ఈ సందర్భంగా విడుదల చేసిన విజయ్ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది.
బ్లడ్ షేడ్ ఆర్ట్ తో పబ్లిసిటీ డిజైనర్ గోపీ ప్రసన్న ఈ పోస్టర్ ని బ్రష్ తో డిజైన్ చేయడం విశేషం. హీరో విజయ్ ఈ పోస్టర్ లో బనియన్ పై ఒంటినిండా బ్లడ్ తో కనిపిస్తున్నాడు. అంతే కాకుండా చేతుల్లో బ్లడ్ కారుతున్నట్టుగా కనిపిస్తున్న స్టిల్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. సినిమాలో గ్యాంగ్ స్టర్ గా విజయ్ నటిస్తున్న ఈ మూవీకి ఏ టైటిల్ ని ఖరారు చేయనున్నారన్నది తెలియాలంటే శుక్రవారం సాయంత్రం 5 గంటల వరకు వేచి చూడాల్సిందే.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.