'పుష్ప పుష్ప' దెబ్బ‌కు వ‌ర‌ల్డ్ షేకింగ్!

'పుష్ప పుష్ప' పాట యూట్యూబ్‌లో మునుపెన్నడూ చూడని రికార్డులను నమోదు చేస్తోంది.

Update: 2024-05-02 15:53 GMT

అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేష‌న్‌లో రూపొందుతున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా యాక్షన్ మూవీ `పుష్ప: ది రూల్` నుండి మొదటి సింగిల్ ఈ బుధ‌వారం విడుదలైంది. ఇది భారీ చార్ట్‌బస్టర్‌గా నిల‌వ‌డ‌మే గాక రికార్డులు బ్రేక్ చేస్తోంది. ఇప్ప‌టికే ఇండియా వైడ్ అత్య‌ధిక వీక్ష‌ణ‌ల‌తో మోత మోగించింది. `పుష్ప పుష్ప..` అనే టైటిల్ తో రూపొందించిన ఈ లిరిక‌ల్ సాంగ్ ని దేవీశ్రీ ప్రసాద్ స్వరపరిచారు. నకాష్ అజీజ్ - దీపక్ పాడారు.

'పుష్ప పుష్ప' పాట యూట్యూబ్‌లో మునుపెన్నడూ చూడని రికార్డులను నమోదు చేస్తోంది. 6 భాషల్లో 40 మిలియన్ల వీక్షణలు .. 1.27 మిలియన్ల లైక్‌లతో ఈ పాట 24 గంటల్లో అత్యధికంగా వీక్షించిన భారతీయ లిరికల్ వీడియోగా నిలిచింది. అక్కడితో ఆగకుండా `పుష్ప పుష్ప` ప్రస్తుతం 15 దేశాలలో ట్రెండింగ్‌లో ఉంది. ఇటీవ‌లి కాలంలో ఇది ఒక ప్ర‌భంజ‌నం అని చెప్పాలి.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి దేశ విదేశాల్లో పెరుగుతున్న ఇమేజ్ ని ఇది ప్ర‌తిబింబిస్తోంది. ఆగస్టు 15న ప్రపంచ వ్యాప్తంగా అత్యంత భారీగా పుష్ప 2 విడుద‌ల కానుంది. థియేట్రికల్ క‌లెక్ష‌న్ల‌లో ఈ చిత్రం ప్ర‌భంజ‌నం సృష్టిస్తుంద‌ని అంచ‌నా ఉంది.

Read more!

అల్లు అర్జున్ ల్యాండ్ మార్క్ స్టెప్పులు ప‌వ‌రేంటో మ‌రోసారి ఈ కొత్త పాట‌లో నిరూపించాడు. షూ డ్రాప్ హుక్ స్టెప్ తో మ‌రోసార గుబులు రేపాడు. అతడి అద్భుతమైన క‌ద‌లిక‌లు.. బ్యాలెన్సింగ్ శైలి మైండ్ బ్లాక్ చేసింది.

పుష్ప పుష్ప బాణీ, స్వ‌రాలు యూనిక్ నెస్ తో పాట‌ను తక్షణ హిట్‌గా మార్చాయి. ఈ చిత్రంలో ఫహద్ ఫాసిల్, రష్మిక మందన్న త‌దిత‌రులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ - సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

Tags:    

Similar News