‘మాస్టర్’ డేట్ ఫిక్స్.. ఇదే ఫైనల్

Update: 2020-12-29 09:00 GMT
తమిళ తలపతి విజయ్ లేటెస్ట్ మూవీ ‘మాస్టర్’ రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది. పొంగల్ గిఫ్ట్ గా జనవరి 13న ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నట్టు మేకర్స్ ప్రకటించారు. అయితే.. ఈ రిలీజ్ డేట్ అభిమానుల్లో ముందే ప్రచారంలో ఉంది. కానీ.. చిత్ర యూనిట్ అధికారికంగా నేడు ప్రకటించింది. దీంతో విజయ్ సంక్రాంతి బరిలో ఉన్నాడనే విషయం అఫీషియల్ గా అనౌన్స్ అయ్యింది. పాన్ ఇండియా మూవీగా ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగు, హిందీ భాషల్లో ఒకేసారి రిలీజ్ అవుతోంది. హిందీలో ‘విజయ్ ది మాస్టర్’ పేరుతో విడుదల చేస్తున్నారు.

ఖైతి (తెలుగులో ఖైదీ) చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశారు. విజయ్ మంచి ఫామ్ లో ఉన్నాడు. వీరిద్దరి కలయికలో రూపొందిన ‘మాస్టర్’పై అభిమానుల్లో విపరీతమైన హైప్ ఏర్పడింది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ కు విశేష స్పందన లభించింది. అనిరుధ్ సంగీతానికి మంచి క్రేజ్ ఏర్పడింది. దీంతో.. ఈ చిత్రం కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

కాగా.. ‘మాస్టర్’ విడుదలపై మేకర్స్, ఎగ్జిబిటర్స్ ఇటీవల సమావేశమయ్యారు. థియేటర్లలో 100 శాతం ఆక్యుపెన్సీ కోసం వారు ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు తమిళనాడు ముఖ్యమంత్రిని కూడా కలిశారు. దీనిపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం ప్రకటించలేదు. అయితే.. కరోనా స్ట్రెయిన్ నేపథ్యంలో పర్మిషన్ రాదని భావిస్తున్నారు. ఒకవేళ 100 శాతానికి అనుమతి వస్తే మాత్రం.. కొత్త రికార్డ్‌లను సెట్ చేయడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇక, తెలుగులో ‘మాస్టర్’ గట్టి పోటీని ఎదుర్కోబోతున్నాడు. ఇక్కడ మరో మూడు చిత్రాలు బరిలో ఉన్నాయి. రవితేజ ‘క్రాక్’, రామ్ ‘రెడ్’, బెల్లంకొండ సాయి ‘అల్లుడు అదుర్స్’చిత్రాలు సంక్రాంతికి రిలీజ్ అవుతున్నాయి. ఇవన్నీ ‘మాస్టర్’ విడుదలైన తర్వాతి రోజు నుంచి లైన్లో ఉన్నాయి. అయితే.. సోలో ఓపెనింగ్ డేని దక్కించుకోవడంతో మాస్టర్ మంచి కలెక్షన్ సాధించే అవకాశం ఉందని అంటున్నారు.
Tags:    

Similar News