క్రేజీ మూవీ కోసం సూపర్‌ స్టార్‌ పై టెస్ట్‌ షూట్‌

Update: 2021-06-30 05:30 GMT
సౌత్‌ ఆడియన్స్ తో పాటు బాలీవుడ్‌ ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న షారుఖ్‌ ఖాన్‌ మరియు అట్లీల కాంబో సినిమా అతి త్వరలోనే మొదలు కాబోతుంది. అట్లీ దర్శకత్వంలో షారుఖ్‌ మూవీ గురించి రెండు మూడు సంవత్సరాలుగా మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి. కాని కొన్ని కారణాల వల్ల సినిమా ఆలస్యం అవుతూ వచ్చింది. ఎట్టకేలకు సినిమా కు సంబంధించిన పనులు ముమ్మరంగా సాగుతున్నాయని బాలీవుడ్‌ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ప్రస్తుతం షారుఖ్‌ చేస్తున్న పఠాన్ మూవీ పూర్తి అయిన తర్వాత అట్లీకి డేట్లు ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

అట్లీ దర్శకత్వంలో షారుఖ్‌ ఖాన్‌ మూవీ కోసం టెస్ట్‌ షూట్‌ ను నిర్వహించారు. షారుఖ్‌ ఖాన్‌ తో పాటు కొందరు నటీ నటులు కూడా ఈ టెస్ట్‌ షూట్‌ లో పాల్గొన్నారట. సూపర్‌ స్టార్‌ షారుఖ్‌ ఖాన్‌ టెస్ట్ షూట్‌ లో పాల్గొనడంతో పాటు తన లుక్ విషయం లో మరియు పాత్ర విషయంలో కూడా పలు సూచనలను షారుఖ్‌ ఇచ్చాడని తెలుస్తోంది. టెస్ట్‌ షూట్‌ ఔట్‌ పుట్‌ పట్ల యూనిట్‌ సభ్యులు సంతృప్తి వ్యక్తం చేశారని సమాచారం.

ఈ సినిమా లో హీరోయిన్‌ గా ఎవరు నటించబోతున్నారు అనే విషయమై స్పష్టత కరువు అయ్యింది. బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్స్ దీపికా పదుకనే.. కత్రీనా కైఫ్‌.. పరిణితి మొదలుకుని సౌత్‌ లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార తో సంప్రదింపులు జరుపుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పటి వరకు హీరోయిన్‌ విషయంలో మాత్రం తుది నిర్ణయం తీసుకోలేదనే అంటున్నారు. సౌత్‌ అభిమానులు మాత్రం నయనతారను షారుఖ్‌ కు జోడీగా నటింపజేయాలని కోరుకుంటున్నారు. మరి అట్లీ నిర్ణయం ఏంటో చూడాలి.
Tags:    

Similar News