• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  రివ్యూల పై నిప్పులు...

రివ్యూల పై నిప్పులు చెరిగిన తెనాలి డైరెక్టర్

By - Tupaki Desk
Update: 2019-11-16 05:52 GMT
పొగిడితే ఉబ్బితబ్బిబ్బైపోవడం.. తెగిడితే నొచ్చుకోవడం మానవ సహజం.  దీనికి ఎవరూ అతీతులు కారు.  అలా కాకుండా పొగిడినా తిట్టినా ఒకే విధంగా స్వీకరించడం నిజంగా.. నిజ్జంగా జ్ఞానుల వల్లే అవుతుంది.  అలాంటి వారు తక్కువే ఉంటారు. ఇప్పుడు ఈ పొగడ్తలు విమర్శలు టాపిక్ ఎందుకంటే శుక్రవారం వస్తే చాలు సినిమాలు రిలీజ్ అవుతాయి.  వెంటనే రివ్యూలు వస్తాయి.  మెజారిటీ సందర్భాలలో రివ్యూలు నెగెటివ్ గా ఉంటాయి.. ఎందుకు అంటే పిండి కొద్ది రొట్టె.

వందలో పది సినిమాలే హిట్లు. ఈ లెక్కన పది సినిమాల కే పాజిటివ్ రివ్యూలు వస్తాయి. మిగతా 90 సినిమాలకు నెగెటివ్ రివ్యూలు వస్తాయి.  అవి ఫిలిం మేకర్లకు ఎలా నచ్చుతాయి? సహజంగానే ఎవరి సినిమా వారికి ముద్దు కాబట్టి రివ్యూలు నచ్చవు.  ఈ శుక్రవారం 'తెనాలి రామకృష్ణ BA BL' రిలీజ్ అయింది. ఈ సినిమాకు మిశ్రమ స్పందన దక్కింది. రివ్యూల విషయం కూడా సేమ్.. మిక్స్డ్ రివ్యూస్ వచ్చాయి.  దీంతో ఈ రివ్యూలు దర్శకుడు జీ. నాగేశ్వర రెడ్డి గారికి నచ్చ లేదు. రివ్యూల పై ఆయన ఫైర్ అయ్యారు.

రివ్యూల పై నాగేశ్వర రెడ్డి గారి స్పందన ఆయన మాటల్లోనే..  "నేను శంకరా భరణం తీస్తున్నాను.. స్వాతిముత్యం తీస్తున్నాను అని ఎవరికీ చెప్ప లేదు. మేము ఎంటర్టైనర్ తీస్తున్నామని చెప్పాము.. అలానే ఒక కామెడీ ఎంటర్టైనర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాము.  సినిమా చూసిన ప్రేక్షకులు చక్కగా రిసీవ్ చేసుకుంటున్నారు.  థియేటర్లలో హాయిగా నవ్వుకుంటున్నారు. అలాంటప్పుడు ఇక మీ రేటింగ్ ఏంటో నాకు అర్థం కావడం లేదు. ప్రేక్షకులు బ్రహ్మాండంగా నవ్వుతున్నారు.. విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నారు. మా డిస్ట్రిబ్యూటర్లు ఫోన్ చేసి.. మాకు బ్రహ్మాండం గా డబ్బులు వస్తున్నాయి.. కమీషన్ లు వస్తున్నాయి. మీరు మంచి సినిమా తీశారు.. పబ్లిసిటీ చెయ్యండి అంటున్నారు. వాళ్ళకంటే మనం గొప్పవాళ్ళమేమీ కాదు.  ప్రేక్షకుల కంటే గొప్పవాళ్ళం కాదు. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే మనం సినిమా ఫీల్డ్ ను నమ్ముకుని బతుకుతున్నాం.  మీకు ఏదైనా నచ్చకపోతే రాయొద్దు.  కానీ మీరు సినిమాను తిట్టొద్దు. ప్రేక్షకుల కు నచ్చింది అది మాకు చాలు. అలా అని నేను అందరూ రివ్యూయర్ల గురించి మాట్లాడడం లేదు. యాభై శాతం మంది రివ్యూయార్లు మా సినిమా గురించి చాలా బాగా రాశారు. వారికి కృతజ్ఞతలు" అంటూ తన వాదన వినిపించారు.


Tags:    
  • Tenali Rama Krishna Review 
  • Tollywood 
  • Tollywood Latest Updates 
  • Tollywood News 
  • Nageswara Reddy 
  • Tollywood Directors 
  • Tupaki News 

Similar News

రణ్‌బీర్‌కి ఇలా, యష్‌కి అలా…రామాయణం మూవీ వెనుక ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్..!

2026-11-20 10:20 GMT

బ‌న్నీ రేసులో బోయ‌పాటి నెంబ‌ర్ - 4!

2026-11-20 10:20 GMT

పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన సమంత.. కొడుకు పేరు ఏమిటంటే?

2026-11-20 09:21 GMT

సౌత్ ఇండ‌స్ట్రీపై రాజ‌మండ్రి బ్యూటీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

2026-11-20 09:21 GMT

Allu Aravind Three Stars: చిరు, చరణ్, బన్నీ..!

2026-11-20 08:28 GMT

'ఓం' మూవీ రివ్యూ

2026-11-20 08:27 GMT

తెలిసిన వారినే ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతున్నాం?

2026-11-20 08:23 GMT

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS