ఫ్యాన్స్ కు ట్రీట్: ఐమాక్స్ లో టెంపర్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్ లో ఎన్నో మరపురాని చిత్రాలు ఉన్నాయి. సూపర్ హిట్లు ఉన్నాయి.. బ్లాక్ బస్టర్లు ఉన్నాయి.. నిజంగా ఫేక్ లేకుండా నిజ్జమైన ఇండస్ట్రీ హిట్లు కూడా ఉన్నాయి. ఎన్ని సినిమాలు ఉన్నాపటికీ ఎన్టీఆర్ కెరీర్లో 'టెంపర్' ప్రత్యేకమైనది. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'టెంపర్' ఒక్కసారి ఎన్టీఆర్ లోని నటవిశ్వరూపాన్ని బయటకు తీసుకొచ్చింది. "నా చూట్టూ ఈగో వైఫై లా ఉంటది" అని మాస్ చేత విజిల్స్ వేయించినా.. కోర్ట్ రూమ్ లో "మమ్మల్ని వెంటనే ఉరితీసే దమ్ముందా?" అని జడ్జిని సవాలు చేస్తూ ప్రేక్షకుల చేత కంటతడి పెట్టించినా ఎన్టీఆర్ కు ఎన్టీఆరే సాటి.
ఇప్పుడు ఈ ఇంట్రో ఎందుకంటే ఈ సినిమా రిలీజై ఐదేళ్ళు పూర్తవుతున్న సందర్భం గా ఒక ట్రిబ్యూట్ లాగా ఐమాక్స్ లో 'టెంపర్' సినిమాను ప్రదర్శిస్తున్నారు. ఈ సినిమా 2015 ఫిబ్రవరి 13 న విడుదలైంది. అదే తేదీన ఐమ్యాక్స్ లో ఈ స్పెషల్ స్క్రీనింగ్ జరగనుంది. ఈ షో ఫ్యాన్స్ కు ఒక ట్రీట్ అని చెప్పొచ్చు. ఈ సినిమా ఎన్టీఆర్ కే కాదు.. ఎన్టీఆర్ అభిమానులకు కూడా ప్రత్యేకమైనదే. ఎందుకంటే 'టెంపర్' కు ముందు ఎన్టీఆర్ వరస ఫ్లాపులతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. టెంపర్ తో మొదలైన విజయాల పరంపర ఇప్పటివరకూ కొనసాగుతూ ఉండడం విశేషం.
ఇక ఈ 'టెంపర్' దర్శకుడు' పూరి జగన్నాధ్ కూడా గత చాలాకాలం ఫ్లాపులతో సతమతమైనప్పటికీ ఈమధ్యే 'ఇస్మార్ట్ శంకర్' తో సూపర్ హిట్ సాధించారు. మరి ఈ ఇస్మార్ట్ డైరెక్టర్... యంగ్ టైగర్ కాంబో మరోసారి రిపీట్ అవుతుందో లేదో చూడాలి.