• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఫిబ్రవరిలో తెలుగు...

ఫిబ్రవరిలో తెలుగు సినిమా.. ఏం జరిగింది?

By - Tupaki Desk
Update: 2017-02-26 08:26 GMT
తెలుగు సినిమాలకు అత్యంత కలిసొచ్చే సీజన్ సంక్రాంతి. ఈ సీజన్ అయ్యిందంటే మళ్లీ వేసవి వచ్చే వరకు బాక్సాఫీస్ డల్లుగా ఉంటుంది. ఫిబ్రవరి.. మార్చి నెలల్ని అన్ సీజన్‌ గా పరిగణిస్తారు. ఐతే గత కొన్నేళ్లలో సినిమాల తాకిడి బాగా పెరిగిన నేపథ్యంలో ఫిబ్రవరిని మన నిర్మాతలు ఫిబ్రవరిని కూడా వదలట్లేదు. ఈ ఫిబ్రవరిలో సైతం వారానికి రెండు చొప్పున సినిమాలు బాక్సాఫీస్ బరిలోకి దిగాయి. మరి ఈ నెలలో ఏ సినిమా ఎలాంటి ఫలితాన్నందుకుందో చూద్దాం పదండి.

నేచురల్ స్టార్ నాని మూవీ ‘నేను లోకల్’ ఫిబ్రవరికి అదిరిపోయే ఆరంభాన్నిచ్చింది. వరుస హిట్లతో ఊపుమీదున్న నాని క్రేజ్ ఈ చిత్రానికి బాగా ఉపయోగపడింది. కంటెంట్ యావరేజ్ గా ఉన్నా వినోదానికి ఢోకా లేకపోవడంతో ఈ సినిమా అదిరిపోయే ఓపెనింగ్స్ తెచ్చుకుంది. రూ.30 కోట్ల షేర్ వసూళ్లలో నాని కెరీర్లోనే ఇది బిగ్గెస్ట్ హిట్టయింది. అమెరికాలో ఈ చిత్రం మిలియన్ డాలర్లకు పైగా వసూలు చేయడం విశేషం. దీంతో పాటుగా రిలీజైన మలయాళ డబ్బింగ్ మూవీ ‘కనుపాప’ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది.

ఫిబ్రవరి రెండో వారంలో రెండు పెద్ద సినిమాలొచ్చాయి. ఒకటి సూర్య డబ్బింగ్ మూవీ ‘సింగం-3’ అయితే.. ఇంకోటి నాగార్జున-రాఘవేంద్రరావుల ఆధ్యాత్మిక చిత్రం ‘ఓం నమో వేంకటేశాయ’. ఈ రెండూ కూడా ఆశించిన ఫలితాన్నందుకోలేదు. సింగం-3కి ఓపెనింగ్స్ బాగున్నాయి కానీ.. ఆ తర్వాత వసూళ్లు పడిపోయాయి. ‘ఓం నమో..’కు ఊహించని విధంగా పూర్ ఓపెనింగ్స్ వచ్చాయి. సినిమా తర్వాత కూడా పుంజుకోలేకపోయింది. మంచి సినిమా అన్న పేరు మాత్రమే మిగిలింది తప్ప వసూళ్లు లేవు. బయ్యర్లకు భారీ నష్టం తప్పలేదు. ఈ సినిమా థియేట్రికల్ రన్ దాదాపుగా ముగిసింది.

మూడో వారం వచ్చిన ‘ఘాజీ’కి అద్భుతమైన రివ్యూలొచ్చాయి. మంచి వసూళ్లూ దక్కాయి. ఈ ఏడాది వచ్చిన బెస్ట్ ఇండియన్ మూవీగా ‘ఘాజీ’ పేరు తెచ్చుకోవడం వివేషం. రెండో వారంలోనూ ఈ చిత్రం మంచి వసూళ్లతో దూసుకెళ్తోంది. ఇక చివరి వారంలో వచ్చిన సాయిధరమ్ తేజ్ మూవీ ‘విన్నర్’కు బ్యాడ్ టాక్ వచ్చింది. కానీ ఓపెనింగ్స్ మాత్రం బాగున్నాయి. తొలి రోజే తెలుగు రాష్ట్రాల్లో రూ.5.6 కోట్ల షేర్ తో ఆశ్చర్యపరిచిందీ సినిమా. విజయ్ ఆంటోనీ మూవీ ‘యమన్’కు యావరేజ్ టాక్ వచ్చింది వసూళ్లు పర్వాలేదు. కానీ ఈ రెండు సినిమాలూ వీకెండ్ తర్వాత నిలబడటం కష్టంగానే ఉంది. మొత్తానికి ఫిబ్రవరి మిశ్రమ ఫలితాలతో ముగిసింది. మరి మార్చి ఎలా ఉంటుందో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Telugu Movies 
  • February 
  • Tollywood Movies 
  • Telugu NEWs 

Similar News

రణ్‌బీర్‌కి ఇలా, యష్‌కి అలా…రామాయణం మూవీ వెనుక ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్..!

2026-11-20 10:20 GMT

బ‌న్నీ రేసులో బోయ‌పాటి నెంబ‌ర్ - 4!

2026-11-20 10:20 GMT

పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన సమంత.. కొడుకు పేరు ఏమిటంటే?

2026-11-20 09:21 GMT

సౌత్ ఇండ‌స్ట్రీపై రాజ‌మండ్రి బ్యూటీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

2026-11-20 09:21 GMT

Allu Aravind Three Stars: చిరు, చరణ్, బన్నీ..!

2026-11-20 08:28 GMT

'ఓం' మూవీ రివ్యూ

2026-11-20 08:27 GMT

తెలిసిన వారినే ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతున్నాం?

2026-11-20 08:23 GMT

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS