• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  జనవరి ఊపు ఫిబ్రవరిలోనూ..

జనవరి ఊపు ఫిబ్రవరిలోనూ..

By - Tupaki Desk
Update: 2017-02-07 05:11 GMT
తెలుగు సినిమాకు సుడి తిరిగినట్లుగా ఉంది ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే. ఈ ఏడాది స్టార్టింగ్ అదిరిపోవటం.. తాజాగా అది కంటిన్యూ అయ్యే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. సాధారణంగా నాలుగు సినిమాలు విడుదల అయితే.. ఒక సినిమా మాత్రమే సూపర్ హిట్ కావటం ఉంటుంది. కానీ.. నాలుగు సినిమాలురిలీజ్ అయితే మూడు సినిమాలు సూపర్ హిట్లు కావటం చాలా అరుదుగా జరుగుతుంది. అలాంటి అరుదైన సీన్ ఈ ఏడాది స్టార్టింగ్ లో కనిపించి సినీ పరిశ్రమకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది.

ఈ ఏడాది ప్రారంభంలో బోణీ కొట్టిన చిరు కమ్ బ్యాక్ మూవీ ఖైదీ నంబరు 150 సూపర్ డూపర్ హిట్ కావటం తెలిసిందే. ఖైదీ రిలీజ్ అయిన తర్వాతి రోజునే విడుదలైన గౌతమి పుత్ర శాతకర్ణి సూపర్ హిట్ కావటంతో పరిశ్రమ యావత్తు పండగ చేసుకుంది. అందరి అంచనాలకు తగ్గట్లే పండగ రోజు విడుదలైన శతమానం భవతి సినిమాకు కలెక్షన్ల వర్షం కురవటంతో ఈ ఏడాది ఆరంభం అదిరిపోయిందన్న మాట వినిపించింది. భారీ సినిమాల మధ్యన వచ్చిన ఆర్ నారాయణమూర్తి హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్యకు నిరాశ తప్పలేదు.

ఆ తర్వాత కాస్త గ్యాప్ తో వచ్చిన లక్కున్నోడు ఓకే అనిపించింది. అలా జనవరి ముగిస్తే.. ఫిబ్రవరి స్టార్టింగ్ లో రిలీజ్ అయిన కనుపాప డబ్బింగ్ మూవీ మంచిపేరు తెచ్చుకుంది. ఇక.. నాని హీరోగా నటించిన నేను లోకల్ బాగా రన్ కావటం.. కలెక్షన్లు కొల్లగొట్టటం టాలీవుడ్ కు కొత్త ఉత్సాహం వచ్చినట్లైంది.

ఇక.. ఈ వారం విడుదల కానున్న ఓం నమో వెంకటేశాయ.. సింగం మీదన చాలానే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఈ రెండు సినిమాలు సక్సెస్ పక్కా అన్న మాట వినిపిస్తోంది.ఇక.. మూడో వారంలో విడుదలయ్యే ఘాజీ మీద ఇప్పటికే అంచనాలు పీక్స్ కు చేరటం తెలిసిందే. ఈ నెలాఖరులో రానున్న విన్నర్ మీదా అంచనాలు బాగున్న నేపథ్యంలో.. జనవరి మాదిరే ఫిబ్రవరిలోనూ సినిమాలు సక్సెస్ ఫుల్ గా నడిచే ఛాన్స్ లు ఎక్కువగా ఉన్నాయన్న మాట వినిపిస్తోంది. అదే జరిగితే టాలీవుడ్ కి కావాల్సిందేముంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Telugu Movies 
  • February 
  • Tollywood Movies 
  • Telugu NEWs 

Similar News

రణ్‌బీర్‌కి ఇలా, యష్‌కి అలా…రామాయణం మూవీ వెనుక ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్..!

2026-11-20 10:20 GMT

బ‌న్నీ రేసులో బోయ‌పాటి నెంబ‌ర్ - 4!

2026-11-20 10:20 GMT

పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన సమంత.. కొడుకు పేరు ఏమిటంటే?

2026-11-20 09:21 GMT

సౌత్ ఇండ‌స్ట్రీపై రాజ‌మండ్రి బ్యూటీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

2026-11-20 09:21 GMT

Allu Aravind Three Stars: చిరు, చరణ్, బన్నీ..!

2026-11-20 08:28 GMT

'ఓం' మూవీ రివ్యూ

2026-11-20 08:27 GMT

తెలిసిన వారినే ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతున్నాం?

2026-11-20 08:23 GMT

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS