100 ధియేటర్లు పెంచేసుకున్నారా? టూ మచ్

Update: 2017-08-16 12:07 GMT
నిజంగానే ఒక్కోసారి చూస్తే అసలు మన ఫిలిం ఇండస్ర్టీలో ధియేటర్లను కొందరు గుప్పెట్లో పెట్టేసుకుని గేమ్స్ ఆడేస్తున్నారా అనిపిస్తుంది. కొన్నిసార్లు యావరేజ్ టాక్ వచ్చిన సినిమాలకు కనీసం ఓ రెండు ధియేటర్లను కూడా పెంచరు కాని.. ఒక్కోసారి అదే సినిమాకు వందల్లో పెంచుతారు. ఏదో 10 ధియేటర్లు పెంచితే సర్లే పోనివ్ అనుకుంటారు కాని.. ఏకంగా 100 ధియేటర్లను అంటే టూ మచ్ కదా.

ఇప్పుడు ఒక సినిమా ఉంది. దానికి కూడా అందరితోపాటే యావరేజ్ టాకే వచ్చింది. కాని ఆ సినిమాను అద్భుతంగా ఉందంటూ పొగిడించేస్తూ మనోళ్ళు ఆ సినిమాకు ధియేటర్లను పెంచేశారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 100 ధియేటర్లు పెరిగిపోయాయ్. అసలు అలా ఎలా పెంచారు అని అడిగేవారే లేరు. అవతల ఎక్కువ బడ్జెట్లో తీసిన సినిమాలకు కూడా సేమ్ ఇదే టాక్ వచ్చింది. వాటికి ధియేటర్లను పెంచితే ఖచ్చితంగా వారికి డబ్బులను రికవర్ చేసుకోవడానికి అవకాశం వస్తుంది. అలా కాకుండా మన ధియేటర్లను పెంచుకుంటూ పోతే.. మన లాభాలు పెరుగుతాయి కాని అవతలోళ్ళకి నష్టాలే వస్తాయి. ఈ ఎమోషనల్ లాజిక్ అస్సలు ఆలోచించరా?

ఒక్కోసారి ఇలాంటి సిట్యుయేషన్లను చూసినప్పుడే.. సినిమా ధియేటర్లను కూడా టిటిడి కళ్యాణ మండపాల తరహాలో ఏదన్నా కమిటీ వేసి సినిమాలను ఎలాట్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. కాని ఆవేశపడాల్సినోళ్లే సైలెంట్ గా ఉంటే.. ఈ గుత్తాధిపత్యానికి ఎదురేది!!
Tags:    

Similar News