• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మహేష్ ను వాడేసుకుంటున్న...

మహేష్ ను వాడేసుకుంటున్న ఐస్ క్రీమ్ పాప

By - Tupaki Desk
Update: 2015-09-08 05:25 GMT
తేజస్వి మదివాడ.. మహేష్ సినిమా ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’లో నాక్కొంచెం క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువ అంటూ ఓ చిన్న క్యారెక్టర్ లో సందడి చేసి.. ఆపై రామ్ గోపాల్ వర్మ ‘ఐస్ క్రీమ్’ మూవీతో ఏకంగా హీరోయిన్ రోల్ కొట్టేసింది. ఆ తర్వాత ఆమెకు హీరోయిన్ గా పెద్దగా అవకాశాలు రాలేదు కానీ.. కీలకమైన పాత్రలైతే చేస్తోంది తేజస్వి. ఈ మధ్యే ‘శ్రీమంతుడు’ సినిమాలో ఓ చిన్న పాత్రలో కనిపించిన ఈ తెలుగమ్మాయి మళ్లీ హీరోయిన్ అవతారమెత్తుతోంది. శ్రీమంతుడు సినిమాలోని సూపర్ హిట్ పాట ‘జతకలిసే..’ పల్లవే ఆమె సినిమాకు టైటిల్ కాబోతుండటం విశేషం. అశ్విన్ అనే కొత్త కుర్రాడు హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు ‘జతకలిసే’ అనే టైటిల్ ఖరారు చేశారు. నూతన నిర్మాణ సంస్థ ‘యుక్త క్రియేషన్స్’ పతాకంపై నరేష్ రావూరి నిర్మిస్తున్నాడు. ‘అలామొదలైంది’ ఫేమ్ స్నిగ్ధ ఓ ప్రధానపాత్రలో నటిస్తోంది.

దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు, మాటీవీ సంయుక్తంగా నిర్వహించిన ‘రేపటి దర్శకులు’ అనే కార్యక్రమంలో టాప్-10లో చోటు సంపాదించి.. పరుచూరి బ్రదర్స్, చిన్నికృష్ణ వంటి స్టార్ రైటర్లు.. రామ్ గోపాల్ వర్మ, గుణ శేఖర్ వంటి టాప్ డైరెక్టర్ల దగ్గర పని చేసిన రాకేష్ శశి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. జర్నీ నేపథ్యంలో సాగే ఈ ప్రేమ కథని వైజాగ్, అన్నవరం, రాజమండ్రి, రామచంద్రాపురం, రంపచోడవరం అటవీ ప్రాంతాలతో పాటు హైదరాబాద్ పరిసర ప్రాంతాల లో చిత్రీకరించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటుంది. వినాయక చవితి సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేయబోతున్నారు. ఈ సినిమాతో విక్కీ అనే కొత్త సంగీత దర్శకుడు పరిచయమవుతున్నాడు.
Tags:    
  • Tejaswi 
  • Jatha Kalise Movie 
  • Telugu NEws 

Similar News

'సీన్' మూవీ రివ్యూ

2026-11-06 07:54 GMT

గార్జియస్ లుక్ లో అందరినీ తన వైపు తిప్పుకున్న శ్రీలీల.. ఔట్ఫిట్ తోనే మాయ చేస్తూ!

2026-11-06 07:51 GMT

రాజకీయాల నుంచి వెండితెరకు అసాధారణ ప్రయాణం!

2026-11-06 07:30 GMT

'సమ్మర్ హాలిడేస్' రివ్యూ

2026-11-06 07:23 GMT

ఫ్లాపుల తర్వాత రామ్ మాస్టర్ ప్లాన్.. 2027లో రెండు సినిమాల రిలీజ్‌కు రెడీ!

2026-11-06 06:30 GMT

సూర్యకు మళ్లీ 30 కోట్ల టార్గెట్

2026-11-06 05:49 GMT

కాజల్‌కు ఈ పార్ట్ 2 కష్టాలేంటి!

2026-11-06 05:49 GMT

కన్నుగీటుతూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్న జాన్వీ కపూర్!

2026-11-06 05:45 GMT

భారీ బడ్జెట్ అంటే ఈ రెండు బ్యానర్లే గుర్తొస్తున్నాయా!

2026-11-06 05:06 GMT

రామాయణం కలెక్షన్స్.. ఓపెనింగ్స్ ఓకే కానీ!

2026-11-06 05:05 GMT

వారణాసి: ఇక స్ట్రాంగ్‌గా మొదలవ్వాలి!

2026-11-06 05:03 GMT

ఆదిపురుష్, రామాయణం.. తేడా అక్కడే కనిపించింది!

2026-11-06 04:06 GMT

Copyright @2026

Powered by Blink CMS