• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మెగాస్టార్‌ తో తేజ...

మెగాస్టార్‌ తో తేజ ఆర్టికల్‌ 370 మూవీ?

By - Tupaki Desk
Update: 2019-11-27 06:17 GMT
విభిన్నమైన ప్రేమ కథలతో టాలీవుడ్‌ కు పలువురు నటీ నటులను గతం లో పరిచయం చేసి తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్‌ ను దక్కించుకున్న దర్శకుడు తేజ. గత దశాబ్ద కాలంగా ఈయన ప్రాభవం అంతగా కనిపించడం లేదు. మళ్లీ ఈమద్యే కాస్త సందడి చేస్తున్నాడు. ఇటీవల ఈయన కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన 'ఆర్టికల్‌ 370'పై ఒక సినిమా ను చేసేందుకు సిద్దం అవుతున్నట్లు గా వార్తలు వస్తున్నాయి. ఒక ఆసక్తికరమైన స్టోరీ లైన్‌ ను ఇప్పటికే సిద్దం చేసుకున్నాడని త్వరలోనే పట్టాలెక్కించబోతున్నట్లు గా ప్రచారం చేస్తున్నారు.

ప్రస్తుతం ఈ సినిమా కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ గోవా లో జరుగుతున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ఇదే సమయంలో ఈ సినిమా స్టోరీ లైన్‌ ను బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబచ్చన్‌ కు తేజ వినిపించాడని.. ఆయన స్టోరీ లైన్‌ కు ఇంప్రెస్‌ అయ్యి నటించేందుకు ఓకే చెప్పినట్లు గా సమాచారం అందుతోంది. స్క్రిప్ట్‌ వర్క్‌ పూర్తి అయిన తర్వాత తన తుది నిర్ణయంను చెప్తానంటూ అమితాబ్‌ చెప్పాడని కూడా టాక్‌ వినిపిస్తుంది.

అమితాబ్‌ తో పాటు పలువురు ముఖ్య నటీనటులు మరియు కొందరు కొత్త వారు ఈ సినిమాలో నటించబోతున్నారు. బాలీవుడ్‌ లో కూడా ఆర్టికల్‌ 370కి సంబంధించిన సినిమాలు ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుపుకుంటున్నాయి. త్వరలోనే అవి కూడా పట్టాలెక్కే అవకాశం ఉందంటున్నారు. వాటికంటే ముందే తేజ ఆర్టికల్‌ 370 మూవీ పట్టాలెక్కే అవకాశం ఉందంటున్నారు. నిజంగానే తేజ చేయబోతున్న ఈ సినిమాలో మెగాస్టార్‌ అమితాబ్‌ ఉంటే సినిమా స్థాయి అమాంతం పెరగడం ఖాయం.

తెలుగులో మాత్రమే కాకుండా హిందీ ఇతర భాషల్లో కూడా విడుదల చేసే అవకాశాలుంటాయి. తేజ ఇప్పటి వరకు ఈ ప్రాజెక్ట్‌ విషయమై సైలెంట్‌ గానే ఉన్నాడు. ఆయన ఎప్పుడు నోరు విప్పుతాడా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వచ్చే ఏడాది ఆరంభం లో సెట్స్‌ పైకి వెళ్లే అవకాశం ఉందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

Tags:    
  • Teja New Movies 
  • Tollywood Directors 
  • Tollywood Latest Movie Upodates 
  • Telugu News 
  • Telugu Daily News 
  • Tollywood News 
  • Tupaki News 

Similar News

దీపావ‌ళి లుక్‌తో క‌ట్టి ప‌డేసిన న‌టి కం గాయ‌ని

2026-11-09 22:30 GMT

సీనియ‌ర్ న‌టుడు పోగొట్టుకున్న‌ది స‌రే వార‌స‌త్వ‌ ఆస్తుల విలువ‌?

2026-11-09 19:30 GMT

'DNK' ట్రైలర్ టాక్: బెట్టింగులు.. దొంగతనాలతో మౌళి కామెడీ గోల

2026-11-09 19:16 GMT

'పొలిమేర 3' గ్లింప్స్: ​కొమరయ్య తాంత్రికం.. అర్జున్ సర్జా పవర్ఫుల్ ఎంట్రీ

2026-11-09 19:10 GMT

ఏంటిది? బేబి బంప్‌తో స‌మంత ప్ర‌యోగాలు!

2026-11-09 19:04 GMT

సెల‌బ్రేష‌న్‌లో మ‌హేష్-చ‌ర‌ణ్‌ తో ఆ ప్ర‌ముఖుడు ఎవ‌రు?

2026-11-09 19:03 GMT

పిక్‌టాక్‌ : మెగా ఫ్యాన్స్‌కి బెస్ట్‌ దీపావళి గిఫ్ట్‌

2026-11-09 19:02 GMT

పిక్‌టాక్‌ : స్టైలిష్ అందాల పలక్‌

2026-11-09 19:01 GMT

అలీ భార్య జుబేదా బేగం సోషల్ మీడియా సంపాదన ఎంతో తెలుసా?

2026-11-09 13:30 GMT

డమ్మీ థియేటర్లు.. బల్క్ బుకింగ్స్

2026-11-09 12:56 GMT

కారాల కళ్ళ పిల్లకు ఆది సైట్.. 'ఈగో రాజా' రౌడీ రాకసి

2026-11-09 12:51 GMT

21 ఏళ్ల‌కే వంద సినిమాల‌తో సంచ‌ల‌నం!

2026-11-09 12:30 GMT

Copyright @2026

Powered by Blink CMS