• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  హీరోలను ఏకిపారేసిన తేజ

హీరోలను ఏకిపారేసిన తేజ

By - Tupaki Desk
Update: 2015-09-09 11:59 GMT
తేజ.. ఈ పేరు ఓ సంచలనం. సినిమాలతోనే కాదు, మాటలతోనూ సెన్సేషన్ క్రియేట్ చేయడం ఆయనకు అలవాటు. ఈ మధ్య ‘హోరాహోరీ’ ఆడియో ఫంక్షన్ లో మొత్తం టాలీవుడ్ మీద ఆయన చేసిన విమర్శలు హాట్ టాపిక్ అయ్యాయి. ఇప్పుడు తేజ మరోసారి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. తనతో పని చేసిన హీరోల మీద ఆయన విమర్శలు ఎక్కుపెట్టారు. తెలుగు హీరోలు కృతజ్నత చూపరంటూ ఆయన హాట్ కామెంట్ చేశారు. పేర్లు పెట్టి మరీ ఆయన విమర్శలు గుప్పించడం విశేషం.

‘‘ఎన్టీఆర్-ఏఎన్నార్ కాలంలో పరిస్థితులు వేరుగా ఉండేవి. ఇప్పుడు రోజులు అలా లేవు. ఈ తరం హీరోలు కృతజ్నత చూపించరు. నేను ఉదయ్ కిరణ్ - నితిన్ - నవదీప్ లాంటి హీరోల్ని ఇంట్రడ్యూస్ చేశాను. గోపీచంద్ కష్టాల్లో ఉన్నపుడు లైఫ్ ఇచ్చాను. ఐతే వాళ్లలో చాలామంది మంచి స్థితికి చేరాక నన్ను విస్మరించారు. నేను ఫోన్ చేసినా తీయలేని స్థితికి చేరుకున్నారు. ఐతే  కాజల్ - సుమన్ శెట్టి లాంటి వాళ్లు మాత్రం నాతో టచ్ లో ఉన్నారు. ఎప్పుడైనా నాతో పని చేయడానికి రెడీ అని చెప్పారు. ప్రధానంగా హీరోలతో, వారి తలబిరుసుతో నాకు సమస్య. వాళ్లు ఏనాడూ కృతజ్నతా భావంతో లేరు. ఐతే అలాగని నేనేమీ కొత్త వాళ్లను ఇండస్ట్రీకి పరిచయం చేయకుండా ఆగను. ప్రతి విషయాన్ని నేను సానుకూల దృక్పథంతో చూస్తా. వేరే వాళ్లకు సాయం చేయడానికి ప్రయత్నిస్తా’’ అని ఓ ఇంటర్వ్యూ లో చెప్పాడు తేజ.

ఇంతకీ తేజ ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశాడో మరి. ఆయన పేర్లు చెప్పిన వాళ్లందరూ తనతో అలాగే ప్రవర్తించారా? లేదా అందులో కొందరా? ఏదేమైనా తేజ కొత్త సినిమా ‘హోరాహోరీ’ ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో తేజ మళ్లీ మునుపటి ఫామ్ అందుకోవాలని ఆశిద్దాం.
Tags:    
  • Teja 
  • Hora Hori Movie 
  • Telugu NEws 

Similar News

హీరోయిన్ అంటే ఇలా ఉండాలి.. తెలుగు ఇండస్ట్రీని ఇప్పటికీ మర్చిపోలేదు!

2026-11-04 06:03 GMT

స్టార్ హీరోలకు ఫస్ట్ డే మేజిక్.. హీరోయిన్ సినిమాలకు ఆ క్రేజ్ రావాలంటే?

2026-11-04 06:01 GMT

బ్యాక్ అందాలతో సెగలు పుట్టిస్తున్న అలియా.. అవుట్ ఫిట్ లో ప్రత్యేకత ఏంటో తెలుసా?

2026-11-04 05:40 GMT

కిరణ్ అబ్బవరం.. ఈ జనరేషన్‌తో కొత్త భయం!

2026-11-04 04:56 GMT

కిరణ్ అబ్బవరం.. నిర్మాతకు కనిపించిన మరో యాంగిల్!

2026-11-04 04:34 GMT

బుడ్డోడు ప్రజ్వల్.. మొన్న AK 47.. ఇప్పుడు సమ్మర్ హాలీడేస్

2026-11-04 04:20 GMT

తరుణ్ భాస్కర్.. హిట్ ఇచ్చిన షాక్ అలాంటిది!

2026-11-04 04:20 GMT

రెబల్ లుక్ లో హుమా ఖురేషి.. కుర్రాళ్లు ఏమైపోవాలి?

2026-11-04 04:19 GMT

షారూక్ కోసం కరణ్ జోహార్.. ఎంత ప్రేమంటే..

2026-11-04 04:02 GMT

కింగ్ 100 గ్లింప్స్‌.. నాగ్‌కు టబుతోనే అసలు పోటీ!

2026-11-04 04:01 GMT

విజయేంద్ర ప్రసాద్.. ఏం చేస్తున్నారు?

2026-11-04 01:30 GMT

ఆప‌రేష‌న్ సింధూర్‌పై పాన్ ఇండియ‌న్ సినిమా.. యువ‌హీరో జాక్‌పాట్!

2026-11-04 00:30 GMT

Copyright @2026

Powered by Blink CMS