మా ఆవిడ వలన ఛాన్సులు రాలేదు

Update: 2017-08-28 08:34 GMT
ప్రస్తుత రోజుల్లో హీరోలు ఏ స్థాయిలో పాపులర్ అవుతున్నారో అంతే స్థాయిలో విలన్స్ కూడా అదే స్థాయిలో పాపులర్ అవుతున్నారు. హీరోలకు ధీటుగా నటనతో ఆకట్టుకుంటున్నారు. అప్పుడప్పుడు కొన్ని పాజిటివ్ క్యారెక్టర్స్ కూడా చేస్తూ.. వారి స్థాయిలో వారు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. టాలీవుడ్ లో హీరోయిన్స్ లాగే విలన్లు కూడా పరభాషా నటులు కావడం ఈ రోజుల్లో నడుస్తున్న ట్రెండ్.

అయితే అదే తరహాలో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్ విలన్ "తరుణ్ అరోరా". అదికూడా  మెగాస్టార్ 151వ సినిమాతో ఎంట్రీ ఇవ్వడంతో బాగా పాపులర్ అయ్యాడు. ఆ వెంటనే పవన్ కళ్యాణ్ - కాటమరాయుడు సినిమాలో కనిపించి తనదైన శైలిలో నటనతో ఆకట్టుకున్నాడు. అయితే ఇంతకుముందు బాలీవుడ్ - కోలీవుడ్ లో బిజీగా ఉన్న ఈ స్టార్ విలన్ గురించి ఓ వార్త హల్ చల్ చేస్తోంది. టాలీవుడ్ లో ప్రేమించుకుందాం రా అనే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన బ్యుటిఫుల్ హీరోయిన్ అంజలా జవెరిని పెళ్లి చేసుకున్న తర్వాతనే కోలీవుడ్ లో అవకాశాలు పెరిగాయని టాక్ వచ్చింది. దీనిపై అతనేమంటాడు ఇంతకీ?

ఈ కామెంట్లతో చాలా హర్ట్ అయిన తరుణ్ రీసెంట్ గా ఇచ్చినా ఓ ఇంటర్వ్యూలో ఆ విషయంపై స్పందించాడు. తన భార్య అంజలాకు చాలామంది సినీ ప్రముఖులతో పరిచయాలు ఉన్న విషయం వాస్తవమే కానీ ఆమె రికమండేషన్ వల్ల తనకు అవకాశాలు వస్తున్నాయని అనడం పూర్తి అవాస్తవమని చెప్పారు. బాలీవుడ్ లో అవకాశాలు రాకపోవడానికి కారణం తనకు చేసిన పాత్రలే మళ్లీ మళ్లీ రావడం వల్ల రిజెక్ట్ చేశానని చెప్పాడు. ఒక వేళ అవకాశాలు రాకుంటే గనక తన వ్యాపారాలు తనకు ఉన్నాయని చెప్పాడు తరుణ్. 
Tags:    

Similar News