• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అర్జున్ రెడ్డి బాలీవుడ్...

అర్జున్ రెడ్డి బాలీవుడ్ లవర్

By - Tupaki Desk
Update: 2018-05-22 06:46 GMT
టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర సైలెంట్ కిల్లర్ గా వచ్చి సంచలన విజయం నమోదు చేసిన అర్జున్ రెడ్డి బాలీవుడ్ రీమేక్ కు అడుగులు వడివడిగా పడుతున్నాయి. హీరోగా షాహిద్ కపూర్ ఓకే కాగా ఒరిజినల్ ను తెరకెక్కించిన సందీప్ రెడ్డి వంగానే హిందీ బాధ్యతలు కూడా తీసుకున్నాడు. కీలకమైన హీరోయిన్ పాత్రకు ఎవరిని తీసుకోవాలి అనే మీమాంసకు ఎట్టకేలకు తెర పడింది. తారా సుతారియా ఇందులో షాలిని పాండే పాత్ర పోషించనుంది. ఇంటెన్సిటీ ఉన్న ఇలాంటి లవ్ స్టోరీకి కొత్త అమ్మాయి అయితేనే బాగుంటుంది అనే ఉద్దేశంతో తనను సెలెక్ట్ చేసారు. కానీ ఇది తనకు మొదటి సినిమా కాదు. స్టూడెంట్ అఫ్ ది ఇయర్ 2 లో టైగర్ ష్రాఫ్ పక్కన తన మొదటి ఛాన్స్ కొట్టేసింది. టీవీ ద్వారా పాపులర్ అయిన తార అయితేనే అర్జున్ రెడ్డి లవర్ పాత్రకు న్యాయం చేయగలదు అని భావించి నిర్ణయం తీసుకున్నారుగా తెలిసింది. ఇది ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

ఇంకా షూటింగ్ మొదలు కాకుండానే అర్జున్ రెడ్డి రీమేక్ టాక్ అఫ్ ది  టౌన్ గా మారుతోంది. తెలుగులోనే ఇంత బోల్డ్ గా తెరకెక్కిన చిత్రం హిందీలో ఏ రేంజ్ లో ఉంటుందో అన్న అంచనాలు మొదలయ్యాయి. హీరోగా తొలుత వరుణ్ ధావన్ పేరుతో పాటు అర్జున్ కపూర్ పేరు పరిశీలనలోకి వచ్చినప్పటికీ చివరికి అది షాహిద్ కపూర్ ని వరించింది. కాస్త ఇదే ఛాయలున్న డ్రగ్ ఎడిక్ట్ పాత్రను ఉడ్తా పంజాబ్ లో అద్భుతంగా పోషించిన షాహిద్ కపూర్ దీనికి పర్ఫెక్ట్ ఛాయిస్ అని చెప్పొచ్చు. తెలుగులో ఇక్కడున్న పరిమితుల వల్ల పరిమితంగా చిత్రీకరించిన సీన్స్ హిందీలో మాత్రం పూర్తి స్వేచ్ఛతో ఇంతకు మించిన ఎమోషనల్ ఫీల్ తో తెరకెక్కించే విధంగా సందీప్ స్క్రిప్ట్ రాసుకున్నట్టు తెలిసింది. టైటిల్ ఇంకా ఫిక్స్ చేయలేదు. హీరో హీరోయిన్ల నేపధ్యాన్ని కూడా బాలీవుడ్ నేటివిటీకి తగ్గట్టు కొన్ని మార్పులు చేసినట్టు తెలిసింది. సో అర్జున్ రెడ్డి హిందీలో చేయబోయే రచ్చ ఏ రేంజ్ లో ఉంటుందో తెలియాలంటే మాత్రం మరో ఏడాది పట్టేలా ఉంది
Tags:    
  • Tara Sutaria 
  • Shahid Kapoor 
  • Arjun Reddy Remake 

Similar News

రాజమౌళి మహాభారతం కృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడిగా ఈ ముగ్గురు నటులు ఫిక్స్ అయ్యారా?

2026-11-05 18:30 GMT

సూపర్‌స్టార్లు స్వీయ భారం..నేటి తరం మాత్రం నిర్మాతలపై భారం!

2026-11-05 17:30 GMT

వారణాసి మహేష్ బాబు రాముడిగా ఎంత సేపు కనిపిస్తాడు...

2026-11-05 16:32 GMT

స్టెప్-మదర్ కాదు అంతకుమించి!

2026-11-05 16:30 GMT

అంగరంగ వైభవంగా సాయి దుర్గ తేజ్, కిరణ్ నిశ్చితార్థం.. అమ్మాయి వివరాలు ఇవే!

2026-11-05 16:16 GMT

రెడ్ అవుట్‌ఫిట్‌లో స్టన్నింగ్ లుక్‌తో మెరిసిన పాలక్!

2026-11-05 16:16 GMT

'రామాయణ' సెట్స్‌లో సీతగా సాయి పల్లవి.. BTS ఫొటోలు వైరల్!

2026-11-05 16:15 GMT

RC17: హీరో.. హీరోయిన్..విలన్.. ఎవరెవరంటే..!

2026-11-05 16:15 GMT

హై బడ్జెట్ ఫిల్మ్‌లో దళపతి విజయ్.. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో!

2026-11-05 16:12 GMT

అనిల్ రావిపూడి.. ఈసారి యాక్షన్ కూడా గట్టిగానే..

2026-11-05 16:12 GMT

ఒకప్పుడు ఏలిన టాప్-5 హీరోయిన్‌లు నేడు ఊహించ‌ని స్థితిలో!

2026-11-05 15:30 GMT

డస్టీ రోజ్ శారీలో షాలిని అందాల సందడి!

2026-11-05 14:30 GMT

Copyright @2026

Powered by Blink CMS