ఇంటెన్స్ లవ్.. తాప్సీ ఇండైరెక్ట్ పంచ్

Update: 2019-07-16 06:13 GMT
చెంపదెబ్బలు ప్రేమలో భాగమని సందీప్ వంగా శెలవివ్వడం 'అర్జున్ రెడ్డి'.. 'కబీర్ సింగ్' సినిమాల అభిమానులకు ఇంట్రెస్టింగ్ గా అనిపించింది.  అయితే చాలామంది సెలబ్రిటీలకు.. నెటిజన్లకు ఈ కాన్సెప్ట్ కొరుకుడుపడలేదు.  ఇప్పటికే బాలీవుడ్ బ్యూటీ కుబ్రా సేట్ ఒక స్లాప్ వీడియోతో ఈ కామెంట్లపై సెటైర్ వేశారు. టాలీవుడ్ లో సమంతా.. చిన్మయి.. మంచు లక్ష్మి కూడా విమర్శించారు.  తాజాగా ఈ లిస్టులోకి తాప్సీ పన్ను వచ్చి చేరింది.

తాప్సీ తన ట్విట్టర్ ఖాతా ద్వారా "ప్రియురాలి క్యారెక్టర్ ను అనుమానించి ఆమె తల పగలకొట్టి చంపిన 19 ఏళ్ళ యువకుడు" అనే ఒక న్యూస్ క్లిప్పింగ్ ను షేర్ చేసింది. దీంతో పాటు "వారిద్దరూ ఒకరినొకరు పిచ్చిగా ప్రేమించుకున్నారు అని అనుకుందాం. ఈ 'పని' నిజమైన ప్రేమను నిరూపించడానికేనని మనం అనుకోవచ్చు" అంటూ ట్వీట్ చేసింది.  నాగ్ పూర్ కు చెందిన అష్రాఫ్ షేక్.. ఖుషి పరిహార్ ప్రేమికులు.  ఖుషి తనతో కాకుండా పలువురు ఇతర బాయ్ ఫ్రెండ్స్ తో సన్నిహితంగా ఉంటోందన్న అనుమానంతో అష్రాఫ్ ఆమెను అంతమొందించాడు.  ఈ న్యూస్ ఐటెం షేర్ చేయడంలో తాప్సీ ఉద్దేశం సందీప్ వంగా చెప్పిన ఇంటెన్స్ లవ్ డెఫినిషన్ కు పంచ్ చేసినట్టే.

తాప్సీ ఇంతటితో ఆగకుండా "చట్టబద్ధమైన హెచ్చరిక: వ్యంగ్యం వెటకారం అనేవి తెలియని జనాలు నా ట్వీట్ ను దయచేసి పట్టించుకోకండి.  మీ పరిచయం నాకు అవసరం లేదు. థ్యాంక్ యు" అంటూ కొనసాగింపుగా మరో ట్వీట్ చేసింది.  అయితే సందీప్ వంగా పై వేసిన ఇండైరెక్ట్ ట్వీట్ కు ఎక్కువగా నెగెటివ్ రెస్పాన్స్ వచ్చింది.  కొందరు "ఒక దారుణ హత్య జరిగితే దాన్ని నీ పిచ్చి విమర్శకు వాడుకుతున్నావు.. సెన్స్ ఉందా?" అంటూ తిట్టారు.  ఒక వ్యక్తి "సందీప్ వంగా ఇంటెన్స్ లవ్ డెఫినిషన్ లో తలపగల కొట్టి చంపమని చెప్పలేదు. నువ్వు ఎక్కువ చేస్తున్నావు" అంటూ విమర్శించాడు.

    

Tags:    

Similar News