నిరీక్షణకు తెర..! ఒక్కటికాబోతున్న టీవీ జంట..!

Update: 2021-02-16 11:30 GMT
వాళ్లిద్దరూ టీవీ నటులు.. ఎన్నో సీరియల్స్​లో కలిసి నటించారు. ప్రేమలో పడ్డారు. దాదాపు 7 సంవత్సరాల పాటు సహజీవనం చేసిన ఈ జంట తాజాగా పెళ్లిచేసుకోబోతున్నది. వీళ్ల పెళ్లి ఎప్పుడెప్పుడా? అని ఫ్యాన్స్​ ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు ఈ నిరీక్షణకు తెరపడింది.  సీరియల్ నటి తన్వీ తక్కర్‌, ఆదిత్య కాపాడియాలు చాలా కాలంగా ప్రేమించుకుంటున్నారు.   వీళ్లు నటించిన ‘బహు హమారి రజిని-కాంత్‌’ సీరియల్​ ఎంతో పాపులర్​ అయ్యింది. ఇదిలా ఉంటే ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వీళ్ల వివాహం ఫిబ్రవరి 16న (నేడు) జరగబోతున్నది.  రేపు బంధుమిత్రులకు విందు ఇవ్వనున్నారు.

‘ఎక్‌ దూస్రే సే ఖర్తే హే ప్యార్‌ హమ్‌’ సీరియల్ షూటింగ్​లో ఉన్నప్పుడు ఈ జంట ప్రేమలో పడింది. అయితే వీళ్లు దాదాపు ఏడేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. పెళ్లికి ఇరు కుటుంబాల పెద్దలు అంగీకరించడంతో ఎట్టకేలకు వివాహం కాబోతున్నది.  వీళ్లకు 2013 డిసెంబర్‌ 24న వీళ్లకు నిశ్చితార్థం కావడం గమనార్హం. అప్పటి నుంచి సహజీవనం చేస్తున్నారు. తన్వీ కపూర్​ పెళ్లి విషయాన్ని సోషల్​మీడియా వేదికగా పంచుకున్నారు.

‘మా పెళ్లి బంధుమిత్రల మధ్య నిరాడంబరంగా జరుగబోతున్నది. మేము పెళ్లి కోసం ఎక్కువ ఖర్చు పెట్టాలని భావించడం లేదు’ అని కాబోయే భర్త గురించి ఆమె రాసుకొచ్చారు. ‘ ఆదిత్య ఎంతో  మంచివాడు. అందరితోనూ కలసిపోతాడు. నన్ను చాలా బాగా అర్థం చేసుకుంటాడు. ఇటువంటి భర్త దొరకడం నా అదృష్టం’ అంటూ తన్వీ చెప్పుకొచ్చారు.

తన్వీ ‘బెపన్హా ప్యార్‌’, ‘మిల్నే జబ్‌ హమ్‌ తుమ్‌’ ‘సాస్‌ బినా ససురాల్’‌, ‘పవిత్ర రిషిత’, ‘మధుబాల’, ‘ఎక్‌ ఇష్క్‌ ఏక్‌ జూన్’‌, ‘బహు హమరీ రజిని-కాంత్‌’ వంటి సీరియల్స్​లో నటించారు. ‘శఖలక భూమ్‌ భూమ్‌’ షోతో ఆదిత్య పాపులర్​ అయ్యారు. వీళ్లిద్దరి ప్రేమ వ్యవహారాలపై తరచూ వార్తలు వస్తుంటాయి.
Tags:    

Similar News