త‌మ్మారెడ్డి కుటుంబంలో విషాదం!

Update: 2017-07-05 07:44 GMT
ప్రముఖ నిర్మాత - దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ  కుటుంబంలో విషాద ఘ‌ట‌న జ‌రిగింది. ఆయ‌న‌ మనవడు సాకేత్ రామ్ వెల్లంకి(19) మంగళవారం అమెరికాలో మృతి చెందారు. అమెరికాలోని వర్జీనియా రాష్ట్రంలో సాకేత్ నివ‌సిస్తున్నారు. సాకేత్ అంత్యక్రియలు అమెరికాలోని వర్జీనియా - మనస్సాస్ లో ఈ రోజు నిర్వహించనున్నారు.

అయితే, సాకేత్ మృతికి కారణాలు తెలియాల్సి ఉంది. అమెరికా కాలమానం ప్రకారం జూలై 5న మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల్లోపు వర్జీనియాలోని 9609 సెంటర్ స్ట్రీట్ మనస్సాస్‌ లో అంత్యక్రియలను నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.  సాకేత్ కుటుంబానికి ప్రవాసులు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఆయన మరణం పట్ల అమెరికా తెలుగు సంఘం (ఆటా) విచారం వ్యక్తం చేసింది. రేపు వర్జీనియాలో నిర్వహించనున్న కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో తెలుగు వారు హాజరు కానున్నారు.
Tags:    

Similar News