తమిళ సినిమాలకు పన్ను దెబ్బ

Update: 2016-03-11 04:25 GMT
తమిళనాట యూ సర్టిఫికేట్ సినిమాలు పన్ను రాయితీ ప్రకటించే కల్చర్ ఉంది. వీటితో పాటు సీఎం అమ్మ జయ కరుణ ఉన్నవాటికి కూడా ట్యాక్స్ ఎగ్జెంప్షన్ లభిస్తుంది. కానీ ప్రస్తుతం అక్కడ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అవడంతో కొత్త జీవోలు ఇచ్చే అవకాశం లేదు. ఆ తర్వాతైనా కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాకే కొత్త జోవోలు వస్తాయి. దీంతో పలు భారీ బడ్జెట్ సహా చాలా సినిమాలపై ఈ ఎఫెక్ట్ పడనుంది.  

రజినీకాంత్ కబాలి - విజయ్ తెరి - సూర్య 24 - కార్తి తోఝా - ధనుష్ మూవీ కోడి - శింబు నటిస్తున్న ఇదు నమ్మ ఆలు సహా పలు చిత్రాలు రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. రూపాయి కూడా రాయితీ వచ్చే ఛాన్స్ లేకపోవడంతో ఈ సినిమాల నిర్మాతలు అందరూ ఇప్పుడు బెంగ పెట్టేసుకున్నారు.  సినీ నిర్మాతలకు  రాయితీ రూపంలో కోట్ల మొత్తం మిగులుతూ ఉంటుంది. కోలీవుడ్ సినిమాలు భారీ లాభాలు గడించాలంటే.. ఖచ్చితంగా ఈ రాయితీ కావాల్సిందే. ప్రభుత్వం ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ప్రకటించకపోతే.. డిస్ట్రిబ్యూటర్లకు తక్కువ రేట్లకే ఇవ్వాల్సి వస్తుంది.

దీంతో తమిళ్ ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రెసిడెంట్ కలైపులి ఎస్. థాను.. ఎన్నికల ప్రధాన అధికారిని కలిసి, సమస్య వివరించారు. అవసరమైన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పినా.. ప్రస్తుతం పరిస్థితి ఆయన చేతుల్లో కూడా లేదు. ఎన్నికల సమయంలో సినిమా యూనిట్ క్యాష్ హ్యాండ్లింగ్ పై మాత్రం కొన్ని వాగ్దానాలు పొందగలిగింది ప్రొడ్యూసర్స్ కౌన్సిల్.
Tags:    

Similar News