టాలీవుడ్ లో మళ్లీ మోగనున్న తమిళ్ ‘జిబ్రాన్’ గిటార్..
తమిళ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ జిబ్రాన్.. మరోసారి తెలుగులో కంపోజ్ చేయబోతున్నారు. తెలుగులో పలు చిత్రాలకు పనిచేసిన జిబ్రాన్.. మంచి పాటలను అందించారు. ఇప్పుడు నూతన దర్శకుడు తెరకెక్కిస్తోన్న ఓ చిత్రానికి జిబ్రాన్ సైన్ చేసినట్టు సమాచారం.
బాహుబలి’ లాంటి సెన్సేషనల్ హిట్ తర్వాత ప్రభాస్ నటించిన ప్రెస్టేజియస్ మూవీ ‘సాహో’కు సంగీతం అందించింది జిబ్రానే. ఈ మూవీ నుంచి సంగీత త్రయం శంకర్-ఎహసాన్-లాయ్ వైదొలిగిన తర్వాత.. జిబ్రాన్ టేకేవర్ చేశాడు. అంతకు ముందు.. "రన్ రాజా రన్", "జిల్" మరియు "బాబు బంగారం" వంటి చిత్రాలకు సూపర్ హిట్ పాటలు అందించాడు ఈ తమిళ సంగీత స్వరకర్త.
కాగా.. పాటల కన్నా ఎక్కువగా జిబ్రాన్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ పాపులారిటి సంపాదించింది. తెలుగు సినిమాలకు ఆయన అందించిన నేపథ్య స్కోరు అనేక ప్రశంసలను అందుకుంది. అయితే.. ప్రభాస్ “సాహో” తరువాత మరో తెలుగు చిత్రానికి సంతకం చేయలేదు బిజ్రాన్.
తాజాగా.. ఒక కొత్త ప్రొడక్షన్ హౌస్, కొత్త దర్శకుడు బాలాజీ రూపొందిస్తున్న చిత్రానికి పనిచేయడానికి జిబ్రాన్ అంగీకరించినట్టు సమాచారం. ‘సెబాస్టియన్ పి.సి. 524’ పేరుతో “రాజా వారు రాణి వారు” ఫేమ్ కిరణ్ అబ్బవరం హీరోగా ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి జిబ్రాన్ స్వరాలు సమకూర్చనున్నారు.
సాధారణంగా మారుతి, సుజీత్ రెడ్డి, యువి క్రియేషన్స్‌తో కలిసి పనిచేసే జిబ్రాన్.. ఈ చిత్ర కాన్సెప్ట్ నచ్చడంతో అంగీకరించినట్టు సమాచారం. ఈ సినిమాలో రేచీకటితో ఇబ్బంది పడుతున్న పాత్రలో హీరో నటించనున్నాడని తెలుస్తోంది.