పవన్ సిగ్నల్ ఇస్తాడో లేదో

Update: 2017-03-01 18:12 GMT
అసలు పవన్‌ కళ్యాణ్‌ ఎప్పుడు ఏ సినిమాను మొదలెడతాడో లేదో అనే సందేహం చాలామంది మదిలో ఉండటం సహజం. ఎందుకంటే పవన్ చెప్పిన సినిమాను కాకుండా ఇంకోటేదో స్టార్ట్ చేస్తూ ఉంటాడు. ఎవ్వరూ ఊహించని రీతిలో సర్దార్ పక్కనెట్టేసి గోపాల గోపాల చేయడం.. అలాగే సర్దార్ తరువాత కాటమరాయుడు రెడీ చేయడం.. ఇవన్నీ అలాంటి ఆశ్చర్యకర సన్నివేశాలకు తెరతీసిన సంఘటనలు.

ఇప్పుడు కూడా పవన్ కాటమరాయుడు సినిమా పూర్తయ్యాక ఏ సినిమా చేస్తాడు అనే సందేహం ఉండనే ఉంది. ఒక ప్రక్కన త్రివిక్రమ్ డైరక్షన్లో చేయాల్సిన సినిమా దాదాపు కన్ఫామ్ అయిపోతుంటే.. మరో ప్రక్కన మొన్ననే మనోడు తమిళ డైరక్టర్ నీసన్ తో ఏఎం రత్నం ప్రొడక్షన్లో చేయబోయే సినిమాకు ముహూర్తం షాట్ పెట్టించాడు. అందుకే ఇప్పుడసలు పవన్ సిగ్నల్ ఇస్తాడా లేదా అని ఎదురు చూస్తున్నాడు నీసన్.

ప్రస్తుతానికి పవన్ ఫోకస్ మాత్రం కాటమరాయుడు మీదనే ఉంది. ఈ సినిమాను మార్చి 24న ఎట్లాగైనా రిలీజ్ చేయాలని మొత్తం టీమ్ అంతా అహర్నిశలూ శ్రమిస్తున్నారు. అది సంగతి. 
Tags:    

Similar News