• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  విడుదలకు సిద్ధమైన క్రాక్...

విడుదలకు సిద్ధమైన క్రాక్ తమిళ, మలయాళం వెర్షన్స్..!!

By - Tupaki Desk
Update: 2021-01-30 06:48 GMT
టాలీవుడ్ మాస్ రాజా రవితేజ ఈ ఏడాదిని క్రాక్ సినిమాతో విజయవంతంగా ప్రారంభించాడు. ఆయన నటించిన మాస్ యాక్షన్ మూవీ క్రాక్ సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదలై భారీ విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. జనవరి 9న విడుదలైన ఈ మూవీ ఇప్పటికి థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. చాలా సినిమాలు క్రాక్ తో పోటీ పడినప్పటికి సంక్రాంతి విజేతగా క్రాక్ నిలిచింది. ఒంగోలులో జరిగిన నిజ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో రవితేజ పోలీస్ అధికారిగా నటించగా.. ప్రముఖ తమిళ నటులు సముద్రఖని, వరలక్ష్మి శరత్ కుమార్ లు కీలకపాత్రలలో నటించారు.  భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకొచ్చిన క్రాక్ వారి అంచనాలను అందుకుందని చెప్పవచ్చు. అందుకే ఇంతటి విజయాన్ని కట్టబెట్టారు అభిమానులు.

ఇదిలా ఉండగా.. క్రాక్ మూవీ విడుదలైన సమయంలోనే ఈ సినిమాను తమిళ, మలయాళ భాషలలోకి డబ్ చేసి విడుదల చేయనున్నట్లు తెలిపారు మేకర్స్. అయితే క్రాక్ అనువాదం విడుదలకు రెడీ అయ్యిందట. ఫిబ్రవరి 5న తమిళ, మలయాళంలో క్రాక్ డబ్ వెర్షన్ విడుదల కాబోతున్నట్లు సమాచారం. అయితే ఇక్కడ గమ్మత్తు ఏంటంటే.. ఫిబ్రవరి 6న క్రాక్ మూవీ తెలుగులో డిజిటల్ రిలీజ్ అవుతోంది. అల్లు అరవింద్ భారీ ధరకు క్రాక్ డిజిటల్ హక్కులు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాను ఫిబ్రవరి 6న ఆహా ఓటిటిలో రిలీజ్ చేస్తున్నారు. శృతిహాసన్ హీరోయిన్ గా నటించింది. గోపీచంద్ మలినేని, రవితేజ కాంబినేషన్ లో క్రాక్ హ్యాట్రిక్ సినిమాగా రూపొందింది. అయితే ఈ సినిమాను ఠాగూర్ మధు నిర్మించారు.
Tags:    
  • Kollywood 
  • Kollywood News 
  • Kollywood Updates 
  • Kollywood Latest News 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

నేపో కిడ్స్ వ‌ల్ల‌నే ఈ యువ‌న‌టుడికి ఛాన్సుల్లేవా? వెక్కి వెక్కి ఏడ్చాడు!

2026-11-19 08:08 GMT

మాతృశిశు మంగళ ఆశీర్వాదం పద్ధతిలో సమంత సీమంతం.. శీతల్ క్లారిటీ!

2026-11-19 08:08 GMT

శ్రీలీల ఈసారి తెలుగు సినిమాల‌కు ఒకే చెబుతుందా?

2026-11-19 08:07 GMT

నితిన్ వర్సెస్ చైతూ.. అసలు ఫైట్ దర్శకులదే!

2026-11-19 08:07 GMT

Copyright @2026

Powered by Blink CMS