​ఇక నుండి డాక్టర్ తమన్నా!!

Update: 2017-07-23 05:12 GMT
పాల నురగల సుందరి తమన్నా సౌత్ సినిమాలోనే కాదు బాలీవుడ్ లో కూడా  తన అందంతో అందరిచే  వావ్ అనేలా చేసుకుంది. తమన్నా నటనలోనే కాదు కమర్షియల్ యాడ్స్ లో కూడా మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఈ ఏడాది వచ్చిన బాహుబలి లో కూడా  మెరుపు లా మెరిసింది. తమిళ్ సినిమా తో బిజీగా ఉన్న తమన్నా ఇప్పుడు సౌత్ లో తన స్థానాన్ని పదిలపరుచుకునే పనిలో పడింది. ఇన్నేళ్ళ కెరియర్ లో తమన్నా కొన్ని కోట్ల మంది అభిమానులను తన నటనకు గుర్తింపుని స్టార్ హీరోయిన్ అనే స్టేటస్ ని సంపాదించిన తరువాత  ఆమెకు ఒక NGO రూపంలో అరుదైన గౌరవం దక్కనుంది.

సాధారణగా డాక్టరేట్ కావాలి అంటే దేనిలోనైనా రిసర్చ్ చేయాలి లేదంటే ఏదైనా ఒక కళపై గాని సమాజ శ్రేయస్సు కోసం గాని పాటుపడితే వాళ్ళకి డాక్టరేట్ ఇస్తారు. ఇప్పుడు అలానే తమన్నా సౌత్ సినిమాకు  చేసిన కంట్రిబ్యూషన్‌ గాను CIAC అనే ఒక ఎన్జీయో సంస్థ డాక్టరేట్ ఇవ్వబోతుంది. ఈ సంధర్భంగా తమన్నా తన ధన్యవాదాలను తెలియపరిచింది. చిన్న వయసు లోనే సినిమాలులోకి వచిన్న తమన్నా అన్నీ  బాషలు కలిపి సుమారుగా 50 సినిమాలకు పైగా నటించింది. తమిళనాడు కలైమని అవార్డ్ - ఆసియా విజన్ అవార్డ్ - ఆసియనేట్ ఫిల్మ్ అవార్డ్ - సౌత్ స్కోప్ అవార్డ్ లు SIIMA అవార్డ్ ఇంకా ఏడు సార్లు ఫిల్మ్ ఫేర్ అవార్డ్ నామినేషన్ అయన తమన్నా ఇప్పుడు డాక్టరేట్ తో డాక్టర్ కాబోతుంది.

2017 దయవతి  మోదీ అవార్డ్ కూడా తమన్నాను వరించింది. ఇక సినిమాలు విషయంకు వస్తే తమిళ్ హీరో విక్రమ్ హీరోగా నటిస్తున్న స్కెచ్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది అమ్మడు. ఇకపోతే బాలీవుడ్ లో కూడా ఒక కొత్త ఆఫర్ పట్టాక తెలుగులో సందీప్ కిషన్ హీరోగా ఓ సినిమా చేస్తోంది.
Tags:    

Similar News