• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  తమన్నాకి గుర్తుండిపోయేలా...

తమన్నాకి గుర్తుండిపోయేలా చేశారు..!

By - Tupaki Desk
Update: 2022-12-10 23:30 GMT
మిల్కీ బ్యూటీ తమన్నా లేటెస్ట్ మూవీ గుర్తుందా శీతాకాలం. ఈ మూవీలో సత్యదేవ్ సరసన హీరోయిన్ గా నటించింది తమన్నా. తానొక స్టార్ హీరోయిన్ యువ హీరో తో జోడీ కట్టడం ఎందుకు అని బేషజాలు ఏమి లేకుండా వచ్చిన ఛాన్స్ ని వాడేసుకుంది. ఈ టైం లో అమ్మడికి ఇలాంటి ఛాన్సులే కెరీర్ కి ఇంకాస్త బూస్టప్ ఇస్తాయని చెప్పొచ్చు. ఇదిలాఉంటే గుర్తుందా శీతాకాలం సినిమా పూర్తయితే చేసింది కానీ సినిమా ప్రమోషన్స్ లో మాత్రం మొహం చాటేసింది అమ్మడు. సినిమా టీజర్, ట్రైలర్ రిలీజ్ టైం లో సత్యదేవ్ తో పాటుగా అందులో మరో హీరోయిన్ గా చేసిన మేఘా ఆకాష్ మాత్రమే అటెండ్ అయ్యారు.

కేవలం ప్రీ రిలీజ్ ఈవెంట్, ఒకటి రెండు ఇంటర్వ్యూస్ అది కూడా రిలీజ్ కి ఒకటి రెండు రోజుల ముందు తమన్నా వచ్చి పాల్గొన్నది. అసలు తమన్నా ఎందుకు ఇలా చేసింది అంటే సినిమాలో ఆమె పాత్ర నచ్చకపోవడమే అని అంటున్నారు.

అదేంటి సినిమా కథ విన్న టైం లోనే నచ్చుతుందా లేదా అన్నది తెలుస్తుంది కదా తను చేయనంటే బలవంత పెట్టరు కదా అని అనుకోవచ్చు. సినిమాలో తమన్నాదే మెయిన్ లీడ్ రోల్. అయితే సినిమాలో క్యాన్సర్ పేషంట్ గా గుండుతో కూడా తమన్నా నటించింది. ఆ సన్నివేశాలు చేసే టైం లో పెద్దగా ఏమి అనిపించలేదు కానీ ఈ టైం లో ఇలాంటి డీ గ్లామరస్ రోల్స్ లో నటిస్తే కెరీర్ మీద ఎఫెక్ట్ అవుతుందని భావిస్తుంది తమన్నా.

అందుకే గుర్తుందా శీతాకాలం అనే సినిమా తను చేసిందా అన్న విషయాన్ని కూడా మర్చిపోయింది. మళ్లీ సినిమా రిలీజ్ టైం లో కూడా ప్రమోషన్స్ కి అటెండ్ కాకపోతే అలా కూడా తనని బ్యాడ్ చేస్తానని ఫైనల్ గా అమ్మడు ప్రమోషన్స్ కి వచ్చింది. సో గుర్తుందా శీతాకాలం సినిమాకు తమన్నా కాంట్రిబ్యూషన్ బాగానే ఉన్నా పాత్రని సరిగా చూపించలేకపోయారు అన్న అసంతృప్తి అయితే ఆమెకు ఉంది.  

ఆ కారణాల చేతనే ఆ సినిమా ప్రమోషన్స్ ని తమన్నా పెద్దగా పట్టించుకోలేదు. అయితే తమన్నా మాత్రం దీన్ని అంత పెద్దగా హైలెట్ చేయదలచు కోలేదు అందుకే ముందు కొద్దిగా బెట్టు చేసినా రిలీజ్ టైం కి అర్ధం చేసుకుని చిత్ర యూనిట్ కి సపోర్ట్ చేసింది. అందుకే తమన్నాని అందరు ఇష్టపడుతున్నారని చెప్పొచ్చు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    
  • beauty 
  • Tamannaah 
  • GurthundaSeethakalam 
  • movie 
  • satyadev 
  • latestnews 

Similar News

రాజమౌళి మహాభారతం కృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడిగా ఈ ముగ్గురు నటులు ఫిక్స్ అయ్యారా?

2026-11-05 18:30 GMT

సూపర్‌స్టార్లు స్వీయ భారం..నేటి తరం మాత్రం నిర్మాతలపై భారం!

2026-11-05 17:30 GMT

వారణాసి మహేష్ బాబు రాముడిగా ఎంత సేపు కనిపిస్తాడు...

2026-11-05 16:32 GMT

స్టెప్-మదర్ కాదు అంతకుమించి!

2026-11-05 16:30 GMT

అంగరంగ వైభవంగా సాయి దుర్గ తేజ్, కిరణ్ నిశ్చితార్థం.. అమ్మాయి వివరాలు ఇవే!

2026-11-05 16:16 GMT

రెడ్ అవుట్‌ఫిట్‌లో స్టన్నింగ్ లుక్‌తో మెరిసిన పాలక్!

2026-11-05 16:16 GMT

'రామాయణ' సెట్స్‌లో సీతగా సాయి పల్లవి.. BTS ఫొటోలు వైరల్!

2026-11-05 16:15 GMT

RC17: హీరో.. హీరోయిన్..విలన్.. ఎవరెవరంటే..!

2026-11-05 16:15 GMT

హై బడ్జెట్ ఫిల్మ్‌లో దళపతి విజయ్.. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో!

2026-11-05 16:12 GMT

అనిల్ రావిపూడి.. ఈసారి యాక్షన్ కూడా గట్టిగానే..

2026-11-05 16:12 GMT

ఒకప్పుడు ఏలిన టాప్-5 హీరోయిన్‌లు నేడు ఊహించ‌ని స్థితిలో!

2026-11-05 15:30 GMT

డస్టీ రోజ్ శారీలో షాలిని అందాల సందడి!

2026-11-05 14:30 GMT

Copyright @2026

Powered by Blink CMS