• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  తమన్నా గోల్డెన్ ఛాన్స్...

తమన్నా గోల్డెన్ ఛాన్స్ కొట్టేసిందా?

By - Tupaki Desk
Update: 2015-10-24 08:39 GMT
కెరీర్ లో హిట్ల కంటే ఫ్లాపులే ఎక్కువున్న హీరోయిన్ తమన్నా. కానీ అవకాశాలకు మాత్రం ఎప్పుడూ కొదవ ఉండదు మిల్కీ బ్యూటీకి. అందుకు ఆమె టాలెంటు, గ్లామరే కారణం అనడంలో సందేహం లేదు. తక్కువ వయసులోనే మంచి పెర్ఫామర్‌ గా పేరు తెచ్చుకుని పెద్ద పెద్ద అవకాశాలు కొట్టేసింది తమ్మూ. ఇటు తెలుగులో, అటు తమిళంలో కొన్నేళ్లుగా అగ్ర హీరోయిన్లలో ఒకరిగా కొనసాగుతోందామె. రెండు ఇండస్ట్రీల్లోనూ చాలామంది స్టార్ హీరోలతో నటించిన తమన్నాకు ఇప్పుడింకో బంపర్ ఆఫర్ తగిలిందని కోలీవుడ్‌ లో ప్రచారం జరుగుతోంది.

విశ్వనాయకుడు కమల్ హాసన్ సరసన తమన్నా నటించబోతోందన్నది తాజా సమాచారం. కమల్ కొన్నేళ్లుగా హీరోయిన్ల ఎంపికలో చాలా పర్టికులర్‌గా ఉంటున్నాడు. తన పక్కన రెగ్యులర్ హీరోయిన్లకు ఛాన్స్ ఇవ్వట్లేదు. ఒక్క త్రిషకు మాత్రమే ఆ అవకాశం దక్కింది. ఇంతకుముందు ‘మన్నథబాణం’ సినిమాలో నటించిన త్రిష.. ఇప్పుడు ‘చీకటి రాజ్యం’లోనూ కమల్ తో తెరను పంచుకోబోతోంది. ఐతే కమల్ తర్వాతి సినిమాలో తమన్నా కథానాయికగా నటించబోతున్నట్లు సమాచారం.

ప్రస్తుతం ‘చీకటి రాజ్యం’ సినిమాను విడుదల చేసే హడావుడిలో ఉన్న కమల్.. దీని తర్వాత సీనియర్ డైరెక్టర్ మౌళి రాసిన కథతో సినిమా చేయబోతున్నాడు. ‘చీకటి రాజ్యం’ సినిమాతో దర్శకుడిగా మారిన కమల్ శిష్యుడు రాజేశ్ ఎం.సెల్వనే ఈ సినిమాకూ దర్శకత్వం వహిస్తాడట. దీని కోసం తమన్నాను హీరోయిన్ గా ఎంచుకున్నట్లు తెలిసింది. ఐతే త్రిష సీనియర్ కాబట్టి ఓకే కానీ.. తమన్నా కమల్ పక్కన మరీ చిన్నగా కనిపిస్తుందేమో అన్న డౌట్ కొడుతోంది. ఐతే తెరమీద ఏదో ఒక మ్యాజిక్ చేసి జోడీ కుదిరేలా చేసుకోగల దిట్ట కమల్. కాబట్టి కమల్ - తమన్నాల జోడీని చూడ్డానికి రెడీ అయిపోండిక.
Tags:    
  • Tamanna 
  • Kamal Haasan 
  • Telugu NEws 

Similar News

'ఆపరేషన్ సింధూర్'పై రేసింగ్: 10 సినిమాలు ప్ర‌క‌టించారు కానీ..!

2026-11-04 18:30 GMT

తమిళ ఇండస్ట్రీ కన్నా తెలుగు ఇండస్ట్రీలోనే గౌరవం..!

2026-11-04 18:03 GMT

Bigg Boss Telugu 10: తొమ్మిదో వారం డేంజర్ జోన్‌లో ఆ ఐదుగురు!

2026-11-04 18:02 GMT

Bigg Boss Telugu 10: 'రివార్డ్ అండ్ రివెంజ్' లో అదిరిపోయే ట్విస్ట్స్

2026-11-04 18:02 GMT

ఎన్నో మల్టీస్టారర్లలో.. ఈ రాబోయే తెలుగు మల్టీస్టారర్ మిన్న!

2026-11-04 18:01 GMT

అఖిల్ అక్కినేని క్రష్ ఎవరో తెలుసా..?

2026-11-04 18:01 GMT

మినీ కొట్టు పెట్టిన జగపతిబాబు కూతురు.. వీడియో వైరల్!

2026-11-04 17:53 GMT

తెలుగు ఇండస్ట్రీపై పాయల్ రాజ్‌పుత్ ప్రేమ.. అదుర్స్!

2026-11-04 17:52 GMT

AK 47 : ఆ కఠినమైన పని చేయడం అంత సులువు కాదు గురూజీ..!

2026-11-04 17:44 GMT

రాజమౌళి వచ్చాక ఇంటర్వెల్ సీన్స్ మారిపోయాయా? ఇంతకీ ఆయన ఏం చేశాడు...

2026-11-04 17:30 GMT

ఇప్పుడున్న స్టార్ డైరెక్టర్లందరు కలిసి ఒక సినిమా కోసం వర్క్ చేస్తే ఎలా ఉంటుంది?

2026-11-04 16:30 GMT

ప్లాప్స్ లో సీనియ‌ర్లు టాప్ చైర్ కోసం యువ ద‌ర్శ‌కులు!

2026-11-04 15:30 GMT

Copyright @2026

Powered by Blink CMS