నెక్ట్‌ ఏంటీ : నేను ఎలా ఉంటానో అలాగే..!

Update: 2018-11-17 11:05 GMT
మిల్కీ బ్యూటీ తమన్నా సందడి ఈమద్య టాలీవుడ్‌ లో తక్కువ అయ్యింది. తమిళం సినీ పరిశ్రమలో వరుసగా సినిమాలు చేస్తున్న ఈమె తాజాగా తెలుగులో యువ హీరో సందీప్‌ కిషన్‌తో కలిసి ‘నెక్ట్స్‌ ఏంటీ?’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. డిసెంబర్‌ లో విడుదల కాబోతున్న ఈ చిత్రంపై ఆమె చాలా ఆశలు పెట్టుకున్నట్లుగా అనిపిస్తోంది. తాజాగా మీడియా సమావేశంలో మాట్లాడిన తమన్నా పలు ఆసక్తికర విషయాలను షేర్‌ చేసుకుంది.

ఈ చిత్రంలోని నా పాత్ర నా రియల్‌ లైఫ్‌కు చాలా దగ్గరగా ఉంటుంది. నా రియల్‌ లైఫ్‌ లో నేను ఎలా ఉంటానో, ఉండాలని అనుకుంటానో అచ్చు అలాగే ఉంటుంది. ఈ పాత్ర తప్పకుండా అందరికి నచ్చుతుంది. ఇక దర్శకుడు కునాల్‌ కోహ్లీ ఈ చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇవ్వడం సంతోషంగా ఉంది. తెలుగు సినిమా పరిశ్రమ పరిధి చాలా పెరిగింది అనేందుకు ఇదే నిదర్శణం. తప్పకుండా కునాల్‌ కు ఈ చిత్రం తెలుగులో మంచి గుర్తింపును తెచ్చి పెడుతుంది. నాకు సినీ కెరీర్‌ ఇచ్చిన తెలుగు సినిమా పరిశ్రమ అంటే నాకు చాలా గౌరవం. నేను టాలీవుడ్‌ నుండి ఎన్నో విషయాలను నేర్చుకున్నాను అంటూ చెప్పుకొచ్చింది.

‘నెక్ట్స్‌ ఏంటీ’ సినిమాలో ఈతరం ప్రేమ కథను దర్శకుడు చూపించబోతున్నాడు. ఈతరం యువతకు తప్పకుండా ఈ చిత్రం కనెక్ట్‌ అవుతుందని తమన్నా ధీమాగా ఉంది. సందీప్‌ కిషన్‌ తో వర్క్‌ చేయడం బాగా నచ్చిందని చెప్పుకొచ్చింది. ఈ చిత్రంతో మరోసారి తమన్నా తెలుగులో బిజీ అవుతుందేమో చూడాలి.
Tags:    

Similar News