ఏ హీరోయినూ అలా చేయలేదు

Update: 2016-09-26 14:15 GMT
అందం.. అభినయం.. అదృష్టం అన్నీ ఉన్నా  సరే... మిల్కీ బ్యూటీకి ఈ మధ్య కాలం పెద్దగా కలిసి రావడం లేదు. ఈమె లక్ అంతా ఇప్పుడు వెనక్కి తగ్గిపోయి ఎక్కడో దాక్కుండిపోయినట్లుగా ఉంది పరిస్థితి. ముఖ్యంగా తెలుగులో అయితే ఈమెను చాలానే ఫ్లాపులు పలకరించినా.. ఇంకా క్రేజీ హీరోయిన్ గా నిలబడగలగడం పెద్ద విషయమే. అయితే.. తమన్నా లీడ్ రోల్ లో నటించిన హారర్ కామెడీ మూవీ అభినేత్రి.. నెక్స్ట్ శుక్రవారం థియేటర్లలోకి వచ్చేస్తోంది.

ఈ మధ్య కాలంలో హారర్ కామెడీలు చాలానే వస్తున్నా.. ఫిమేల్ ఓరియెంటెడ్ పిక్చర్స్ కూడా రిలీజ్ అవుతున్నా.. అభినేత్రిలో తను చేసిన లాంటి పాత్ర.. రీసెంట్ టైమ్ లో ఏ హీరోయిన్ కూడా చెయ్యలేదని.. అంత డిఫరెంట్ గా ఈ సినిమా ఉంటుందని చెబుతోంది మిల్కీ బ్యూటీ. అలాగని ఇదేమీ భయపెట్టేసే సినిమా కాదన్న తమ్మూ.. అభినేత్రిలో డ్యాన్సులకు ఇంపార్టెన్స్ ఉంటుందని.. ఇంతలేసి డ్యాన్సులు చేసేందుకు ఏ నటి కూడా ప్రయత్నించలేదని చెబుతోంది.

అన్ని భాషల్లోనూ మెప్పించే సబ్జెక్ట్ కావడంతోనే ఇలా మూడు భాషల్లో తీశామని చెబుతూ.. ఇప్పట్లో ఇలా మల్టీ లాంగ్వేజ్ మూవీని ఒప్పుకోబోనని.. అభినేత్రి కోసం అంత కష్టపడాల్సి వచ్చిందని చెప్పింది తమ్మూ. మరి మిల్కీ సుందరి కష్టం ఫలించిందో లేదో తెలియాలంటే.. ఇంకొన్ని రోజులు ఆగాలి.
Tags:    

Similar News