• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  తమన్నా ఫలితమే అనసూయకు...

తమన్నా ఫలితమే అనసూయకు కూడా!

By - Tupaki Desk
Update: 2021-11-10 02:30 GMT
మిల్కీ బ్యూటీ తమన్నా ఫస్ట్‌ టైమ్ హోస్ట్ గా చేసిన మాస్టర్‌ చెఫ్‌ కార్యక్రమం మంచి అంచనాల నడుమ మొదలు అయ్యింది. జెమిని టీవీలో టెలికాస్ట్ అయిన మాస్టర్ చెఫ్‌ ను జనాలు పెద్దగా పట్టించుకోలేదు. తమన్నా హోస్ట్ అవ్వడం వల్ల ఒకటి రెండు వారాలు చూసినా ఆ తర్వాత నుండి లైట్ తీసుకున్నారు. దాంతో మాస్టర్ చెఫ్‌ నిర్వాహకులకు మరియు జెమిని టీవీకి భారీ నష్టం తప్పలేదు. మాస్టర్ చెఫ్ కు ఎంతగా పబ్లిసిటీ చేసినా కూడా ప్రయోజనం లేకుండా పోయింది. షోను ఎంత వివాదంగా మల్చాలని ప్రయత్నించినా కూడా జనాలు పట్టించుకోలేదు. దాంతో చేసేది లేక తమన్నాను తప్పించి అనసూయను హోస్ట్ గా తీసుకు వచ్చారు. షో మద్యలో తమన్నాను తొలగించడం ఖచ్చితంగా ఆమెను అవమానించడం అంటూ అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేశారు. అదే సమయంలో తమన్నా ఈ విషయమై లీగల్ గా ఎదుర్కొనేందుకు సిద్దం అయ్యింది.

తమన్నాతో ఏదో విధంగా రాజీ కుదుర్చుకునేందుకు జెమిని టీవీ అండ్ టీమ్‌ ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ విషయం పక్కన పెడితే తమన్నాను తొలగించి అనసూయను తీసుకు వచ్చిన తర్వాత ఖచ్చితంగా మంచి రేటింగ్ వస్తుందని అంతా ఆశించారు. కాని అదేమీ జరగడం లేదు. తమన్నా ఉనప్పుడు ఎలా రేంటింగ్ ఉందో ఇప్పుడు అనసూయ హోస్ట్‌ గా కూడా అదే ఫలితం.. అదే రేటింగ్‌ వస్తోంది. జబర్దస్త్‌ అందాల ముద్దుగుమ్మ అనసూయ ఎన్నో అంచనాల నడుమ మాస్టర్ చెఫ్‌ లో అడుగు పెట్టింది. ఆమె సందడిగా వంటల కార్యక్రమంను నిర్వహిస్తుంది. అయినా కూడా జనాలు పట్టించుకోవడం లేదు. దీంతో తెలిసింది ఏంటీ అంటే.. హోస్ట్ ల సమస్య కాదు ప్రేక్షకులకు అసలు ఈ కాన్సెప్ట్‌ పెద్దగా ఎక్కలేదు.

అనసూయ ఒక వైపు బుల్లి తెరపై వరుసగా షో లతో బిజీగా ఉన్నా కూడా వెండి తెరపై కూడా ఈ అమ్మడి దూకుడు కొనసాగుతోంది. రంగమ్మత్త వంటి మంచి పాత్ర తర్వాత వరుసగా ఈమెకు ఆఫర్లు వస్తున్నాయి. మరో రంగమ్మత్త స్థాయి పాత్రను పుష్ప సినిమాలో అనసూయకు సుకుమార్‌ ఇచ్చాడట. సుకుమార్‌ మరియు అల్లు అర్జున్‌ ల పుష్ప సినిమా లో అనసూయ పాత్ర చాలా ప్రత్యేకంగా ఆకట్టుకునే విధంగా ఉంటుంది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. అంతే కాకుండా అనసూయ ప్రథాన పాత్రలో రెండు లేడీ ఓరియంటెడ్‌ సినిమాలు కూడా పట్టాలెక్కేందుకు సిద్దంగా ఉన్నాయి. ఐటెం సాంగ్స్ నుండి మొదలుకుని హీరోయిన్‌ గా.. బుల్లి తెరపై హోస్ట్‌ గా గెస్ట్‌ గా ఇలా ఎన్నో రకాలుగా అనసూయ ఆకట్టుకుంటూనే ఉంది.
Tags:    
  • Tamanna 
  • F2 
  • Master Chef 
  • Web series 
  • bhola shankar 
  • Godfather 
  • Anasuya Bharadwaj 

Similar News

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

నేపో కిడ్స్ వ‌ల్ల‌నే ఈ యువ‌న‌టుడికి ఛాన్సుల్లేవా? వెక్కి వెక్కి ఏడ్చాడు!

2026-11-19 08:08 GMT

మాతృశిశు మంగళ ఆశీర్వాదం పద్ధతిలో సమంత సీమంతం.. శీతల్ క్లారిటీ!

2026-11-19 08:08 GMT

శ్రీలీల ఈసారి తెలుగు సినిమాల‌కు ఒకే చెబుతుందా?

2026-11-19 08:07 GMT

నితిన్ వర్సెస్ చైతూ.. అసలు ఫైట్ దర్శకులదే!

2026-11-19 08:07 GMT

Copyright @2026

Powered by Blink CMS