బొమ్మాలి మర్చిపోతారు - తమన్నా

Update: 2016-09-26 07:31 GMT
మిల్కీ బ్యూటీ తమన్నా ఇప్పుడు బాగా బిజీగానే కాదు.. బోలెడంత సంతోషంగా కూడా ఉంది. తను లీడ్ రోల్ చేసిన సినిమా ఒకేసారి మూడు భాషల్లో విడుదల కానుండడమే.. ఈ బిజీకి.. హ్యాపీనెస్ కి కారణాలు. కోలీవుడ్.. బాలీవుడ్.. టాలీవుడ్ లలో దేన్నీ వదలకుండా చకచకా తిరిగేస్తూ.. అభినేత్రి ప్రమోషన్స్ చేసేస్తోంది తమన్నా. క్లీవేజ్ ను చూపిస్తూ.. భుజాలను ఓపెన్ గా వదిలేసి తమ్మూ వేసుకొచ్చిన డ్రస్ కేకలు పెట్టించేసింది.

అసలు అభినేత్రి ఆఫర్ రావడం తన అదృష్టం అన్న తమన్నా.. ఈ సినిమా తర్వాత ప్రభుదేవాని గురువుగా స్వీకరిస్తున్నట్లు చెప్పింది. చిన్నప్పటి నుంచి తాను ఎప్పుడూ ఏదీ ట్రైనింగ్ తీసుకోవడానికి సమయం కుదరలేదని.. ఎప్పుడూ షూటింగ్ లతోనే గడిచిపోయేదని చెప్పిన తమన్నా.. ఇకపై ఎప్పుడు డ్యాన్స్ చేసినా.. ప్రభుదేవానే తలుచుకుంటానంటూ.. ఇండియన్ మైకేల్ జాక్సన్ ను ఆకాశానికి ఎత్తేసింది. ఇక సోనూసూద్ గురించి అయితే.. తమ్మూ వేసిన డైలాగ్ అదరహో అనాల్సిందే. అరుంధతిలో విలన్ గా చేసి మెప్పించి సోనూ.. తన రొమాంటిక్ యాంగిల్ ని అభినేత్రిలో చూపించాడని అనింది.

ఈ మూవీ తర్వాత బొమ్మాలిని మర్చిపోయి.. అందరూ సోనూసూద్ లో హీరోని చూస్తారట. ఇక తెలుగు వెర్షన్ నిర్మాత కోన వెంకట్ కు.. అభినేత్రి సక్సెస్ తో బ్యాంక్ అకౌంట్ పట్టనన్ని డబ్బులు వచ్చేయాలని కోరుకుంటోందట మిల్కీ.
Tags:    

Similar News