ఆ తర్వాతే షూటింగ్ లు.. తలసాని క్లారిటీ!

Update: 2020-05-27 11:10 GMT
దాదాపు రెండు నెలలుగా షూటింగ్ లు లేక సినీ కళాకారులు, కార్మికులు అష్టకష్టాలు పడుతున్నారు. సీరియళ్లు, సినిమాలపై ఆధారపడిన వారికి పూట గడవని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే సినీ రంగాన్ని పునరుద్దరించేందుకు తెలుగు సినిమా పరిశ్రమ కేసీఆర్ ను కలిసి చర్చించారు. సినీ రంగాన్ని ఆదుకునేందుకు ప్రణాళికలు రెడీ చేయాలని కేసీఆర్ సినీ పెద్దలను కోరారు.

ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో తాజాగా టాలీవుడ్ సినీ ప్రముఖులు భేటి అయ్యారు. మసాబ్ ట్యాంకులోని పశుసంవర్థక శాఖ డైరెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ లో దీనిపై చర్చించారు. సినీ రంగాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని తలసాని అన్నారు. సినీ పరిశ్రమకు బెస్ట్ పాలసీని తీసుకొచ్చేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నామని తెలిపారు.

ప్రస్తుతం కరోనా పరిస్థితులు.. సాధాసాధ్యాలు అన్ని పరిశీలించాకే షూటింగ్ లకు అనుమతిస్తామని మంత్రి తలసాని అన్నారు. సినీ రంగం పట్ల ఎప్పుడూ సానుకూల ధోరణితో ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నారు. పోస్ట్ ప్రొడక్షన్స్ కు ఇప్పటికే అనుమతులు ఇచ్చామని.. షూటింగ్ లపై రేపు మరోసారి సమావేశమవుతామన్నారు.
Tags:    

Similar News