#DRUGS ఆర్యన్ కి తాప్సీ క్లాస్.. వర్కవుటవుతుందా?
కింగ్ ఖాన్ షారుక్ కుమారుడు ఆర్యన్ ఖాన్ పేరు ఇటీవల మార్మోగుతున్న సంగతి తెలిసిందే. ముంబై క్రూయిజ్ పార్టీలో డ్రగ్స్ కేసులో ఆర్యన్ అరెస్ట్ అవ్వడం..సిటీకోర్టు 14 రోజులు రిమాండ్ కు తరలించడంతో అంతటా చర్చనీయాంశంగా మారింది. ఇటీవల డ్రగ్స్ దందాలపై పలువురు సెలబ్రిటీల్ని ఈడీ విచారించింది. అందులో నిజాలు నిగ్గు తేలాల్సి ఉండగా..ఇంతలో ఆర్యన్ పేరు ఇలాంటి వివాదంలో తెరపైకి రావడం సంచలనంగా మారింది. బాలీవుడ్ అంతటా ఆర్యన్ డ్రగ్ అడిక్షన్ హాట్ టాపిక్ గా మారింది. ఆర్యన్ పై ఎవరి అభిప్రాయాల్ని వాళ్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తాప్సీ ఆర్యన్ పై సంచలన వ్యాఖ్యలు చేసారు.
సమాజంలో ఇన్ ప్లూయెన్స్ ఉన్న కుటుంబం నుంచి వస్తే..ఏ చిన్న తప్పు చేసినా పెద్దగా కనిపిస్తుంది. కుటుంబాలు కూడా ఇళ్లలో ఉన్న యువత ఏం చేస్తున్నారు? అన్న దానిపై ఓ కన్నేసి ఉంచాలన్నారు. పెద్ద కుటుంబంలో భాగమైతే బ్యాగేజీ వెనుకనే వస్తుందని..పబ్లిక్ ఫిగర్ లో భాగమైనప్పుడు మాత్రం నచ్చినా..నచ్చకపోయినా జాగ్రత్తగా ఉండాలని కాస్త క్లాస్ తీస్కుంది తాప్సి. అదీ సెలబ్రిటీ హోదాలో ఉన్నప్పుడు ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయని.. వాటిని తట్టుకుని ధైర్యంగా నిలబడాల్సిన అవసరం ఉందన్నారు. తప్పు చేసాడా? లేదా? అన్నది అప్పుడే నిర్ధారించలేమన్నారు. దానికి విచారణ..కోర్టులు చాలా ప్రాసెస్ ఉందన్నారు.
ఆర్యన్ షారుక్ తనయుడు కావడంతో ఇప్పుడీ వ్యవహారం సంచలనంగా మారింది. ఆర్యన్ ఇంకా బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వలేదు. తండ్రి పెద్ద హీరో కావడంతో ఆర్యన్ కూడా వారసుడిగా ఎంట్రీ ఇస్తాడని భావిస్తున్నారు. ఇంతలోనే ఇలాంటి వివాదంలో ఇరుక్కున్నాడు. అయితే డ్రగ్స్ కల్చర్ బాలీవుడ్ లో ఎప్పటి నుంచో ఉంది. దొరికిన వాళ్లు దొంగలు..దొరకని వాళ్లు దొరలు అన్న చందంగా సాగిపోతుంది. అయితే ఆర్యన్ నటుడిగా ఎంట్రీ కాక ముందే ఇలాంటి కేసులో ఇరుక్కోవడం అతని కెరీర్ పై ప్రభావం చూపొచ్చని మీడియా కథనాలు హీటెక్కిస్తున్నాయి. ఆర్యన్ ని ఎవరో కావాలనే ఇరికించారన్న వాదనా ఒక సెక్షన్ మీడియా వినిపిస్తున్న సంగతి తెలిసిందే.