సీరియస్ గా రియాక్ట్ అయిన రానా దగ్గుబాటి

Update: 2019-03-25 17:38 GMT
ఇండస్ట్రీలో ఉన్న మహిళల పై కొందరు మగానుభావులు అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయడం కొత్తేమీ కాదు. రీసెంట్ గా నయనతార కొత్త తమిళ చిత్రం ట్రైలర్ లాంచ్ సందర్భంగా సీనియర్ నటుడు రాధారవి హీరోయిన్ నయనతార పై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశాడు.  తన పురుషాహంకార బుద్దిని చాటుకుంటూ నయన్ ను 'లేడి సూపర్ స్టార్' అని పిలవొద్దని.. ఎంజీఆర్ .. శివాజీ గణేశన్.. రజనీకాంత్ లాంటి లెజెండ్స్ తో పోలిస్తే తనకు హర్టింగ్ గా ఉంటుందని.. ఇంకా ఏవేవో అన్నాడు.

దీంతో సింగర్ కం డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి మొదట రాధా రవిపై విరుచుకు పడింది. తన విషయంలో అందరూ కామ్ గా ఉన్నారని.. ఇప్పుడు నయన్ నడిగర్ సంగంలో సభ్యురాలని.. అందరూ ఖండించాలని కోరింది.  మరోవైపు వరలక్ష్మి శరత్ కుమార్ కూడా రాధారవి వ్యాఖ్యలను ఖండించింది.  రాధిక శరత్ కుమార్.. విశాల్ తదితరులు కూడా రాధారవి వ్యాఖ్యలను తప్పుబట్టారు.  డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ అయితే ఏకంగా రాధారవిని పార్టీ నుండి సస్పెండ్ చేశాడు.  ఇక నయన్ కూడా ఈ ఎపిసోడ్ పై ఘాటుగానే స్పందించింది.

తాజాగా ఈ విషయంపై టాలీవుడ్ స్టార్ రానా దగ్గుబాటి కూడా స్పందించాడు. తన ట్విట్టర్ ఖాతా ద్వారా "ఇప్పుడు Mr. రాధారవి ఒక అద్భుత నటి గురించి చేసిన అసభ్యకరమైన వ్యాఖ్యల గురించి విన్నాను. సర్.. మీ వ్యక్తిత్వం లో ఉండే మాలిన్యాన్ని మీ కామెంట్స్ చూపిస్తున్నాయి.  నయన్ అద్భుత నటన సంగతి కూడా మీ వ్యాఖ్యల్లో తెలుస్తోంది.  #రాధారవి గారు మీరు ఈ  కమ్యూనిటీ కే అవమానం" అంటూ చాలా తీవ్రంగా తన స్పందనను తెలిపాడు. 
Tags:    

Similar News