హమ్మయ్య ఆ వివాదంలోకి నన్ను లాగలేదు

Update: 2020-02-24 02:30 GMT
బాలీవుడ్‌ తో పాటు అన్ని భాషల వారు ప్రతిష్టాత్మకంగా భావించే ఫిల్మ్‌ ఫేర్‌ అవార్డుల విషయమై గతంలో ఎప్పుడు లేని విధంగా విమర్శలు వస్తున్నాయి. కరణ్‌ జోహార్‌ ఫిల్మ్‌ ఫేర్‌ అవార్డుల జ్యూరీ సభ్యుడిగా ఉండటంతో ఆయన సినిమాలకు.. ఆయన సినిమాల్లో ప్రస్తుతం చేస్తున్న వారికే ఎక్కువ అవార్డులు వచ్చినట్లుగా రంగోలీతో పాటు మీడియాలో విమర్శలు వస్తున్నాయి. గల్లీ బాయ్‌ కు ఏకంగా 13 అవార్డులు రావడంతో విమర్శలు తీవ్ర స్థాయిలో వస్తున్నాయి.

కంగనా సోదరి రంగోలీ ప్రముఖ స్టార్స్‌ పై విమర్శల వర్షం కురిపిస్తుంది. అందరు కూడా రాజకీయాలకు పాల్పడి అనర్హులకు అవార్డులు ఇచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదే సమయంలో ఆమె ఉత్తమ నటి అవార్డును దక్కించుకున్న ఆలియా భట్‌ పై కూడా సంచలన ఆరోపణలు చేసింది. ముస్లీం గా బుర్ఖా వేసుకుని పెద్దగా నటించకున్నా కూడా గల్లీ బాయ్‌ సినిమాకు గాను ఆమెకు ఉత్తమ నటి అవార్డును దక్కించుకుందని రంగోలీ కామెంట్స్‌ చేసింది. ఇక తాప్సికి కూడా ఉత్తమ నటిగా అవార్డు వచ్చిన విషయం తెల్సిందే.

సాండ్‌ కీ ఆంఖ్‌ చిత్రంలో బెస్ట్‌ నటన కనబర్చినందుకు గాను ఉత్తమ నటి క్రిటిక్స్‌ అవార్డును తాప్సి దక్కించుకుంది. ఫిల్మ్‌ ఫేర్‌ అవార్డుల గురించి వస్తున్న విమర్శల నేపథ్యంలో వివాదంలో నా పేరు రాకపోవడం సంతోషంగా ఉంది. నా అవార్డు ను జెన్యూన్‌ గా వచ్చిందని అంతా నమ్ముతున్నందుకు ఆనందంగా ఉందంటూ చెప్పుకొచ్చింది. తనకు అవార్డును రావడం కరెక్ట్‌ గా అంతా భావిస్తున్నట్లుగా తాను అనుకుంటున్నట్లుగా పేర్కొంది.
Tags:    

Similar News