పింక్ లోకి ఇందుకే తీసుకున్నారట

Update: 2016-12-04 04:39 GMT

ఢిల్లీ  బ్యూటీ తాప్సీ పన్ను రీసెంట్ గా పింక్ మూవీతో సూపర్ హిట్ కొట్టేసిన సంగతి తెలిసిందే. కమర్షియల్ హిట్ తో పాటు.. ఇటు తన యాక్టింగ్ కి కూడా బోలెడన్ని మార్కులు వేయించుకుని.. ట్యాలెంట్ ప్రూవ్ చేసేసుకుంది. అమితాబ్ బచ్చన్ పక్కన నటించి కూడా పెర్ఫామెన్స్ తో గుర్తింపు తెచ్చుకుందంటే.. తాప్సీ ఏ రేంజ్ లో ప్రతిభ చూపించిందో అర్ధమవుతుంది.

అయితే.. ఇప్పుడు తాప్సీ ఓ సడెన్ షాక్ ఇచ్చింది. తనకు అసలు పింక్ లో అవకాశం రావడానికి కారణమేంటో చెబుతానంటోంది. రన్నింగ్ షాదీ డాట్ కాం అనే మూవీ పోస్టర్ ను పోస్ట్ చేసిన తాప్సీ.. 'నాకు పింక్ మూవీలో ఆఫర్ రావడానికి కారణం ఏంటో.. త్వరలో మీరందరూ త్వరలో తెలుసుకోగలుగుతారు  అని అనౌన్స్ చేయడానికి సంతోషంగా ఉంది. రన్నింగ్ షాదీ డాట్ కాం ఫిబ్రవరి 3.. 2017న విడుదల కానుంది' అని చెప్పింది తాప్సీ.

ముందు రిలీజ్ అయిన పింక్ చూసి చూసి.. ఈ సినిమాలో ఆఫర్ వచ్చిందనడనం సహజమే. కానీ ఇది కాస్త రివర్స్ లో ఉన్నా.. ఇది పింక్ మొదలుకావడానికంటే ముందెప్పుడో ప్రారంభమైందన్న మాట. ఈ మూవీలో రన్నింగ్ షాదీ.కాం అనే వెబ్ సైట్ ను ప్రారంభించి.. పారిపోయి పెళ్లి చేసుకునే జంటలకు హెల్ప్ చేస్తూ ఉండడమే కాన్సెప్ట్. స్టోరీనే కాదు.. ట్రీట్మంట్ కూడా  విభిన్నంగానే ఉంటుందట.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News