• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఇంటర్వ్యూ: 'స్వాతిముత్యం'...

ఇంటర్వ్యూ: 'స్వాతిముత్యం' అనే టైటిల్ ఎందుకు పెట్టామంటే..?

By - Tupaki Desk
Update: 2022-09-24 11:08 GMT
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తమ్ముడు గణేష్ హీరోగా లాంచ్ అవుతున్న చిత్రం "స్వాతి ముత్యం". సితార ఎంటర్టైన్మెంట్స్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రంతో లక్ష్మణ్ కె. కృష్ణ దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయమవుతున్నారు. వర్ష బొల్లమ్మ ఇందులో హీరోయిన్. దసరా సందర్భంగా అక్టోబర్ 5న ఈ వినోద భరితమైన ఈ కుటుంబ కథా చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ జోరుగా ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇందులో భాగంగా దర్శకుడు లక్ష్మణ్ విలేఖర్లతో ముచ్చటించారు.

* దర్శకుడిగా మీ ప్రయాణం ఎలా మొదలైంది?
- చిన్నప్పటి నుంచే సినిమాలు అంటే ఆసక్తి. అప్పట్లో స్కూల్ లో చిన్న చిన్న డ్రామాలు రాసేవాడిని. సినిమాల మీద ఇష్టంతో ఇంజనీరింగ్ ని మధ్యలో వదిలేసి హైదరాబాద్ వచ్చేశాను. అంతకముందే ముగ్గురు నలుగురం స్నేహితులం కలిసి షార్ట్ ఫిలిమ్స్ చేసేవాళ్ళం. ఆ టీమ్ లో ఒక ఫ్రెండ్ కి డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా ఛాన్స్ వస్తే, అతన్ని నమ్ముకొని మేమంతా ఇక్కడికి వచ్చేశాం. అసిస్టెంట్ డైరెక్టర్ గా చాలా చోట్ల ట్రై చేశాను గాని వర్కౌట్ అవ్వలేదు. మళ్ళీ షార్ట్ ఫిలిమ్స్ చేయడం స్టార్ట్ చేశాను. రూ.3 వేల లోపు బడ్జెట్ తో 'లాస్ట్ విష్' అనే షార్ట్ ఫిల్మ్ చేశా. అది చూసి ఒకాయన లక్షా 30 వేలు బడ్జెట్ పెట్టడంతో 'కృష్ణమూర్తి గారింట్లో' అనే షార్ట్ ఫిల్మ్ చేశాం. దానికి మంచి ఆదరణ లభించింది. సైమా షార్ట్ ఫిల్మ్ అవార్డ్స్ లో బెస్ట్ డైరెక్టర్ గా అవార్డు వచ్చింది. అప్పుడు నేను చెప్పిన ఒక స్టోరీ నచ్చి, సైమా వాళ్ళు మూవీ ప్రొడ్యూస్ చేస్తామన్నారు కానీ అది కార్యరూపం దాల్చలేదు. ఆ తర్వాత ఒక ఫ్రెండ్ ప్రొడ్యూస్ చేస్తానన్నాడు. అయితే ముందు ట్రయల్ గా 12 లక్షల బడ్జెట్ తో 'సదా నీ ప్రేమలో' అనే ఇండిపెండెంట్ ఫిల్మ్ చేశాం. దానికి కూడా మంచి ప్రశంసలు దక్కాయి. ఇంతలో లాక్ డౌన్ రావడంతో ఆ సమయంలో ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ రాయాలన్న ఉద్దేశంతో 'స్వాతిముత్యం' స్టోరీ రాయడం జరిగింది.

* ఈ సినిమా కోసం  దేని నుంచైనా స్ఫూర్తి పొందారా?
- గోదావరి జిల్లాల్లో చిన్న చిన్న టౌన్స్ లో ఉదయాన్నే స్కూల్ టీచర్స్ వెళ్లడం, ఇంటి దగ్గర ఉండే చుట్టాలు వచ్చి మన మీద సెటైర్స్ వేయడం.. ఇలా మన చుట్టూ జరిగే సంఘటనల నుంచే ఈ కథ పుట్టింది. ఏదైనా సంఘటన జరిగినప్పుడు మన ఇంట్లో వాళ్ళు స్పందిస్తారు? పక్కింటి వాళ్ళు ఎలా స్పందిస్తారు? ఎవరి ఎమోషన్స్ ఎలా ఉంటాయి ? ఇలాంటివన్నీ ఈ సినిమాలో ఉంటాయి.

* అసలు ఈ సినిమా మెయిన్ ప్లాట్ ఏంటి?
- అబ్బాయి పేరు బాల మురళి కృష్ణ. ఇంజనీరింగ్ పూర్తి చేసి చిన్న టౌన్ లో అప్పుడే జూనియర్ ఇంజనీర్ గా గవర్నమెంట్ జాబ్ తెచ్చుకున్న ఒక యువకుడి కథ ఈ చిత్రం. జాబ్ రాగానే ఇంట్లో వాళ్ళు పెళ్లి చేద్దామని సంబంధాలు చూడటం మొదలుపెడతారు. ఒక సాధారణ పెళ్లిలో కూడా ఎన్ని కష్టాలు ఉంటాయనేది ఆసక్తికరంగా చూపించబోతున్నాం.

* కథ రాసుకున్నాక సితార సంస్థను సంప్రదించారా?
- నేను ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ని కొత్త వాళ్ళతో చేయాలనుకున్నాను. అప్పుడే గణేష్ స్టోరీలు వింటున్నాడు. ఆ సమయంలో ఒక మ్యూచువల్ ఫ్రెండ్ ద్వారా గణేష్ ని కలిశాను. అయితే నేను మొదట గణేష్ కి ఈ కథ చెప్పలేదు. వాళ్ళ బ్రదర్ లా యాక్షన్ సినిమాలు చేస్తాడనుకుని నా దగ్గరున్న వేరే లైన్స్ చెప్పాను. అయితే గణేష్ మాత్రం నేను చేసిన 'సదా మీ ప్రేమలో' ట్రైలర్ చూసి, ఏదైనా సింపుల్ స్టోరీ ఉంటే చెప్పమని అడిగాడు. అప్పుడు ఈ కథ చెప్పడంతో గణేష్ కి బాగా నచ్చింది. ఆ తర్వాత వాళ్ళ ఫాదర్ సురేష్ గారికి చెప్పడం.. ఆయనకు కూడా నచ్చడం. అక్కడి నుంచి సితారకు రావడం జరిగిపోయాయి.

* 'స్వాతి ముత్యం' అనే క్లాసిక్ టైటిల్ ని ఈ చిత్రానికి పెట్టే సాహసం ఎందుకు చేశారు?
- సాహసం అని కాదండి. రాధాకృష్ణ గారికు (చినబాబు) గారికి స్టోరీ చెప్పకముందు వేరే వేరే టైటిల్ అనుకున్నాం. ఆయన మొత్తం కథ విన్నాక.. ఇందులో ఇన్నోసెంట్ క్యారెక్టర్స్ ఉన్నాయని ఆయన సజెస్ట్ చేశారు. ఇందులో విలన్ ఎవరూ ఉండరు. ఒక టౌన్ లో కొన్ని ఇన్నోసెంట్ క్యారెక్టర్స్ మధ్య జరిగే కథ ఇది. అందుకే ఆయన సజీషన్ తో ఈ టైటిల్ పెట్టాం. ఫస్ట్ ఈ టైటిల్ ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో అని భయమేసింది. కమల్ హాసన్ గారు పోషించిన పాత్రతో పోలుస్తారేమో అని భయపడ్డా. కానీ చినబాబు గారు ఇచ్చిన సపోర్ట్ తో ముందుకెళ్ళాం.

* ఇది గణేష్ కి మొదటి సినిమా కదా.. వర్క్ షాప్స్ ఏమైనా చేశారా?
- మా ఇద్దరికీ ఇదే మొదటి సినిమా కదా. తనకి నేను చెప్పిన స్టోరీ అయితే నచ్చింది కానీ.. నేను ఎంతవరకు హ్యాండిల్ చేయగలనని అతనికి డౌట్స్ ఉండొచ్చు. అలాగే నాకు కూడా ఇతనితో అనుకున్న అవుట్ ఫుట్ ఇవ్వగలనా అనే డౌట్స్ వచ్చాయి. అయితే డైరెక్టర్ గా నేను.. హీరోగా తను సక్సెస్ అవ్వాలని ఇద్దరం కలిసి ఎక్కువ ట్రావెల్ అయ్యి, చాలా వర్క్ షాప్స్ చేశాం. అలా ఒకరి మీద ఒకరికి కాన్ఫిడెన్స్ వచ్చింది. దాంతో సెట్స్ మీద ఎలాంటి ఇబ్బంది కలగలేదు.

* వర్ష బొల్లమ్మను ఎవరు ఎంపిక చేశారు?
- వర్ష ఎంపిక నాదే అండీ. '96' మూవీ చూసినప్పుడే ఆ అమ్మాయి నచ్చింది. మొదటి సినిమా చేస్తే ఈ అమ్మాయితో చేయాలనుకున్నాను. స్క్రిప్ట్ రాసుకునేటప్పుడే హీరోయిన్ పాత్రకు ఆమెని ఊహించుకునే రాసుకున్నాను. గణేష్ హీరోగా, సితార సంస్థ నిర్మాణం అనుకున్న తరువాత కొన్ని వేరే పేర్లు కూడా అనుకున్నాం. అయితే అదే టైంలో వర్ష నటించిన 'మిడిల్ క్లాస్ మెలోడీస్' రావడం.. ఆమె పేరు సజెస్ట్ చేయగానే ప్రొడక్షన్ హౌస్ ఒప్పుకోవడం జరిగిపోయాయి.

* సినిమా ఫస్ట్ కాపీ చూసుకున్నారా?.. మీకు సంతృప్తి కలిగిందా?
- చూశానండీ.. చాలా బాగా వచ్చింది. ఫస్ట్ కాపీ వచ్చేవరకు అనుకున్న అవుట్ పుట్ వస్తుందా రాదా అని మనసులో చిన్న భయముండేది. కానీ అవుట్ పుట్ చూశాక హ్యాపీ. డీఓపీ సూర్య గురించి ప్రత్యేకంగా చెప్పాలి. మొదట నేను ఓ లవ్ స్టోరీ ఫిల్మ్ చేద్దామనుకున్నప్పుడు నాతో ట్రావెల్ అయ్యాడు. అయితే అది వర్కౌట్ అవ్వలేదు. ఈ సినిమా ఓకే అయ్యాక, డీఓపీ గురించి చర్చ వచ్చినప్పుడు నాగవంశీ గారు సూర్య అనే పర్సన్ ఉన్నాడని చెప్పారు. ఆ సూర్య, ఈ సూర్య ఒక్కరే అని తెలిసి వెంటనే తీసుకోవడం జరిగింది.

* 'గాడ్ ఫాదర్', 'ది ఘోస్ట్' వంటి పెద్ద సినిమాలతో పాటు విడుదలవుతుంది. అసలు ఈ నిర్ణయం ఎవరిది?.
- విడుదల తేదీ అనేది పూర్తిగా నిర్మాతల నిర్ణయం. ఇది ఫ్యామిలీ ఎంటర్టైనర్ కాబట్టి ఫెస్టివల్ కి విడుదల చేస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో దసరాకు విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే చిరంజీవి గారు, నాగార్జున గారి సినిమాలతో పాటు విడుదల కావడం కొంచెం భయంగా ఉన్నా సంతోషంగా ఉంది.

* మీ అభిమాన హీరో ఎవరు?
- చిరంజీవి గారు. ఆయనతో సినిమా చేసే అవకాశం రాలేదు కానీ ఆయన సినిమా విడుదలవుతున్న రోజే నా సినిమా విడులవుతుంది. చిన్నప్పటి నుంచి నేను అభిమానించిన చిరంజీవి గారి సినిమాతో పాటు నా సినిమా విడుదల కావడం సంతోషంగా ఉంది.

* దర్శకుడిగా మీకు స్ఫూర్తి ఎవరు?
- మణిరత్నం గారు, వంశీ గారు, బాపు గారు, జంధ్యాల గారు.

* తదుపరి సినిమాల గురించి చెప్తారా?
- ఇంకా ఏం అనుకోలేదండి. కానీ ఇలా ఫ్యామిలీ ఎంటర్టైనర్ కాకుండా ఈసారి కామెడీ థ్రిల్లర్ లేదా సీరియస్ డ్రామా చేయాలనే ఆలోచన ఉంది.

* నెక్స్ట్ సినిమా సితారలో ఉండొచ్చా?
- ఉండొచ్చు. ఖచ్చితంగా మాకే చేయాలని అగ్రిమెంట్ అలాంటివి ఏం తీసుకోలేదు. ఫ్రీడమ్ బాగా ఇస్తారు. మళ్ళీ సితారలో చేసే అవకాశముంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    
  • LaxmanKKrishna 
  • SwathiMuthyam 
  • GaneshBellamkonda 
  • VarshaBollamma 
  • Naresh 
  • RaoRamesh 
  • Subbaraju 
  • VennelaKishore 
  • HarshaVardhan 
  • PammiSai 
  • Sapthagiri 
  • MovieNews 

Similar News

డేట్ నైట్స్ సీక్రెట్స్ బయటపెట్టిన కియారా-సిద్ధార్థ్!

2026-11-11 19:30 GMT

ఇద్ద‌రు పిల్ల‌ల త‌ల్లిగా సాయిప‌ల్ల‌విపై మ‌రో ప్ర‌యోగం!

2026-11-11 18:30 GMT

టీటీడీ చైర్మ‌న్ రేసులో సినీ ప్ర‌ముఖులు.. !

2026-11-11 18:30 GMT

నువ్వు ఇండస్ట్రీని ఏలుతావు..యంగ్ హీరోపై అట్లీ మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

2026-11-11 17:30 GMT

దేవరకొండ ఫ్యామిలీ.. ఒక్క సినిమా పడితే!

2026-11-11 16:39 GMT

స్టార్ జాతకాన్ని ముందే పసిగట్టిన త్రివిక్రమ్ శిష్యుడు

2026-11-11 16:38 GMT

6 రోజుల్లో 100 కోట్ల క్ల‌బ్.. సౌత్‌లో ఈ ఒక్క‌డికే

2026-11-11 16:37 GMT

వివేక్‌ సాగర్‌కి జరిగిన నష్టం ఇతర మ్యూజిక్‌ డైరెక్టర్స్‌కి పాఠం..!

2026-11-11 16:37 GMT

అనిరుధ్ పెళ్లి సర్ ప్రైజ్.. ఇక సన్ పిక్చర్స్‌తో కొత్త ఎమోషన్

2026-11-11 16:33 GMT

కావ్య మార‌న్‌తో అనిరుధ్ పెళ్లి మొద‌టి ఫోటో

2026-11-11 14:00 GMT

డేంజర్ జోన్‌లో సీనియర్ హీరోయిన్ల‌ కెరీర్?

2026-11-11 13:30 GMT

స్టార్ డైరెక్ట‌ర్ ఇమేజ్ ని వాడుకోలేక‌పోతున్న ఫ్యామిలీ!

2026-11-11 12:30 GMT

Copyright @2026

Powered by Blink CMS